ఇక వైసీపీ ప్రతిపక్షం కాదు!: లోకేష్ ఆసక్తికరం, బాబుకు థ్యాంక్స్, 'తొలిసారి' ఆసక్తిగా విన్న ఎమ్మెల్యే

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి రావడం లేదు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తమ ప్రతిపక్షం వైసిపి కాదన్నట్లుగా మాట్లాడారు. 1100 కాల్ సెంటర్ తమ ప్రతిపక్షమని వెల్లడించారు.


పవన్ కళ్యాణ్ కూడా, నేను గెలిస్తే: 'అమరావతి'పై జగన్ ఓపెన్ ఆఫర్, మోడీ-బాబు పొత్తుపై

ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇదే మాట చెప్పారు. ఇక నుంచి 1100 కాల్ సెంటర్‌ను మన ప్రతిపక్షంగా చూద్దామని చెప్పారు. అక్కడకు వచ్చే సమస్యలను పరిష్కరించాలన్నారు.

లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వీటికి వైసిపి హాజరు కాలేదు. దీంతో లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మంత్రులను నిలదీయాలని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారని చెప్పారు.

 వైసీపీ లేకున్నప్పటికీ

వైసీపీ లేకున్నప్పటికీ

ప్రతిపక్షం లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీని వేదికగా చేసుకుంటున్నామని లోకేష్ అన్నారు. సభలో అర్ధవంతమైన చర్చ జరుగుతోందని, పట్టిసీమ నీరు శివారు భూములకు చేరడం లేదనే అంశాన్ని ఎమ్మెల్యేలు సభలో ప్రస్తావించారన్నారు.

చంద్రబాబుకు లోకేష్ థ్యాంక్స్

చంద్రబాబుకు లోకేష్ థ్యాంక్స్

ఉమ్మడి ఏపీ రాజధానిగా హైదరాబాద్‌లో పదేళ్లు ఉండే అవకాశం ఉన్నప్పటికీ మన ఏపీ నుంచి పాలన సాగించాలని అతి తక్కువ కాలంలో అసెంబ్లీని ఏర్పాటు చేసిన చంద్రబాబుకు థ్యాంక్స్ అని లోకేష్ అన్నారు. సీనియర్ నేతల మధ్య ప్రసంగించడం తన అదృష్టమన్నారు.

మొదటిసారి ప్రసంగం, ఆసక్తిగా విన్న ఎమ్మెల్యేలు

మొదటిసారి ప్రసంగం, ఆసక్తిగా విన్న ఎమ్మెల్యేలు

1100 కాల్‌సెంటరే తమ ప్రతిపక్షమని లోకేష్ చెప్పారు. ఉపాధిహామిపై 14న సభలో చర్చకు వచ్చే అవకాశం ఉందని, దీనిపై అన్ని వాస్తవాలను సభలో పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని లోకేశ్‌ తెలిపారు. అసెంబ్లీలో తొలి ప్రసంగం చేసిన లోకేశ్‌ను ఎమ్మెల్యేలు అభినందించారు. ఆయన మొదటిసారి ప్రసంగిస్తుండటంతో అందరూ ఆసక్తిగా విన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP Leaders criticised Leader of Opposition YS Jagan Mohan Reddy for boycotting Assembly Session.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి