Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబుపై ఆశలు వదులుకున్న టీడీపీ..?

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై ఇప్పటికే 40 రోజులుపైగా గడిచిపోయాయి. స్కిల్ స్కాంలో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. చంద్రబాబు బెయిల్ కోసం టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికి ఫలితం మాత్రం దక్కడం లేదు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కూడా నారా లోకేష్ కలవడం జరిగింది.

ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా చంద్రబాబుకు బెయిల్ రాకపోవడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీనికి తోడు చంద్రబాబు ఆరోగ్యం గురించి కూడా వారు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లడంతో పార్టీ కార్యక్రమాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. నారా లోకేష్ యువగళం పాదయాత్ర కూడా మధ్యలోనే ఆగిపోవడంతో పార్టీ శ్రేణులు అయోమయానికి లోనవుతున్నారు.

Tdp leaders hopes gone on chandrababu bail.. what was the next plan

చంద్రబాబు ఇప్పట్లో బయటకు రావడం కష్టమనే భావనకు టీడీపీ నాయకులు వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు కేసు విచారణలో తుది తీర్పు ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. ఈనెల 20న క్వాష్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈ నెలాఖరు వరకు సుప్రీంకోర్టుకు దసరా సెలవులు.దీంతో తీర్పు వెలువడే అవకాశం లేదు. ఈ లెక్కన చూసుకుంటే చంద్రబాబు కేసు విచారణ నవంబర్‌లోనే కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో భవిష్యత్తు కార్యచరణను టీడీపీ ప్రకటించింది. చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీ కార్యక్రమాలు స్తంభించాయి. వెంటనే పార్టీ కార్యక్రమాలను ప్రారంభించి కార్యకర్తలను యాక్టివ్ చేయడానికి టీడీపీ నాయకులు సిద్దం అవుతున్నారు. చంద్రబాబు సూచన మేరకు భార్య భువనేశ్వరి ప్రజల్లో ఎక్కుడ ఉండేలా టీడీపీ ప్రణాళికలను సిద్దం చేస్తుంది.

Tdp leaders hopes gone on chandrababu bail.. what was the next plan

వారానికి కనీసం రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటన ఉండేలా చూడాలని చంద్రబాబు సూచించినట్టు సమాచారం. దీనిలో భాగంగానే "నిజం గెలవాలి" పేరుతో భువనేశ్వరి యాత్ర చేపట్టనున్నారు. ''నిజం గెలవాలి'' కార్యక్రమాంతో తిరిగి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారామె.

అటు నారా లోకేష్ కూడా ''భవిష్యత్ కి గ్యారెంటీ'' కార్యక్రమంతో ప్రజల ముందుకు రావడానికి సిద్దం అవుతున్నారు. భువనేశ్వరి, లోకేష్ యాక్టివ్ కావడంతో టీడీపీ శ్రేణులు కాస్త ఉపశమనం పొందుతున్నాయి. మరి చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో భువనేశ్వరి, లోకేష్ చేపట్టిన కార్యక్రమాలు టీడీపీని ఎంత వరకు కాపాడతాయో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+