వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఇద్దరు కాపు నేతలు వైసీపీ లోకి..!! వచ్చే నెలలో వరుస చేరికలు-చంద్రబాబు అడ్డుకొనేనా..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

టీడీపీలో సీనియర్లు ఇప్పుడు వలసబాట పడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయంగా ఎదురు దెబ్బలు తప్పటం లేదు. 2019 ఎన్నికల తరువాత ఇప్పటి వరకు పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు అనధికారికంగా వైసీపీకి దగ్గరయ్యారు. గంటా శ్రీనివాస రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. మరి కొంత మంది తమ పార్టీలో చేరటానికి సిద్దంగా ఉన్నారని వైసీపీ చెబుతోంది. అయితే, పార్టీ సీనియర్లలో కొంత కాలంగా కనిపిస్తున్న అసంతృప్తి ఇప్పుడు బయటకు వస్తోంది.

 బుచ్చయ్య ఎపిసోడ్ తరువాత వరుసగా..

బుచ్చయ్య ఎపిసోడ్ తరువాత వరుసగా..

కొద్ది రోజుల క్రితం పార్టీ స్థాపించిన నాటి నుంచి టీడీపీలోనే ఉంటున్న సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలిగారు. పార్టీకి రాజీనామా చేసేస్తున్నానని ప్రకటించారు. తాను చంద్రబాబు వద్దకు వెళ్లనని ఒక సీనియర్ నేత చెప్పే పరిస్థితి పైన పార్టీలో చర్చ మొదలైంది. అయితే, బుచ్చయ్య తాత్కాలికంగా మెత్త బడ్డారా..లేక, పూర్తిగా తన నిర్ణయాన్ని వాపస్ తీసుకున్నారా అనేది రేపు లేదా ఈ వారాంతంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక, ఇప్పుడు టీడీపీలోని సీనియర్లు ఒక్కొక్కరుగా తమ అసంతృప్తిని బయట పెడుతున్నారు.

జ్యోతుల నెహ్రూ వైసీపీలో చేరుతారంటూ..

జ్యోతుల నెహ్రూ వైసీపీలో చేరుతారంటూ..

మరి కొద్ది రోజుల్లోనే విజయనగరం జిల్లా బొబ్బలి రాజా సుజయ రంగారావు తిరిగి వైసీపీలో చేరటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారని తెలుస్తోంది. విజయనగరం లో పూసపాటి రాజులను దెబ్బ తీయాలంటే..బొబ్బిలి రాజులను దగ్గరకు తీయాలనేది వైసీపీ వ్యూహం. గతంలో 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి తరువాత టీడీపీకి ఫిరాయించిన బొబ్బలి రాజు ఇప్పుడు తిరిగి వైసీపీలోకి రావటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో..తూర్పు గోదావరి సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ గురించి జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఆయన ఆస్పత్రిలో ఉన్నారు. ఆయన జిల్లాలో సీనియర్ పొలిటిషీయన్ గా ఉన్నారు. జగ్గంపేట నియోకవర్గం నుంచి జ్యోతుల నెహ్రూ 1994,1999 లో టీడీపీ నుంచి గెలవగా, 2004 లో ఓడిపోయారు.

వైసీపీలో తగిన ప్రాధాన్యత ఇచ్చినా..

వైసీపీలో తగిన ప్రాధాన్యత ఇచ్చినా..

2009 లో ప్రజారాజ్యం నుంచి ఓడారు. 2014లో వైసీపీ నుంచి గెలుపొందారు. వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా పని చేసారు. జగన్ ఆయనకు తగిన గుర్తింపు ఇచ్చినా.. నెహ్రూ తిరిగి టీడీపీ గూటికి చేరారు. 2019 లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్ది జ్యోతుల చంటిబాబు చేతిలో ఓడిపోయారు. అయితే, ఆయన టీడీపీలో ఇమడలేకపోతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా, పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఓపెన్ గానే తప్పు బట్టారు. చంద్రబాబు నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని అందుకే పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఇకపై కేవలం జగ్గంపేట టీడీపీ ఇన్చార్జ్ గా మాత్రమే కొనసాగుతానని తెలిపారు.

వైసీపీ కీలక నేతతో టచ్ లో ఉన్నారంటూ..

వైసీపీ కీలక నేతతో టచ్ లో ఉన్నారంటూ..

నియోజక వర్గంలో తనను, పార్టీని నమ్ముకుని ఉన్నవారికోసం తాను అండగా నిలబడాల్సిన నైతిక బాధ్యత తనపై ఉందని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తిరిగి వైసీపీలోకి రావాలనే ఆలోచనలో నెహ్రూ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంతనాలు సైతం జరిగాయనేది విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న నెహ్రూ కోలుకున్న తరువాత దీని పైన అధికారికంగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాకు చెందిన ఒక మంత్రి దీని పైన చర్చలు జరిపినట్లు చెబుతున్నారు.

వంగవీటి రాధా సైతం మనసు మార్చుకొని..

వంగవీటి రాధా సైతం మనసు మార్చుకొని..


ఇక, క్రిష్ణా జిల్లాకు చెందిన మరో నేత వంగవీటి రాధాకృష్ణ రాజకీయంగా ఒక రకంగా డైలమా పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రాధాకృష్ణ విజయవాడ తూర్పు నుంచి 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడారు. 2014లో వైసీపీ నుంచి ఓటమి పాలయ్యారు. ఇక, ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ఆయన జగన్ పైన తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీని వీడారు. ఆ సమయంలో వైసీపీ నుంచి స్పందించిన ఆళ్ల నాని తాము రాధాకృష్ణ కు పార్టీల సముచిత గౌరవం ఇచ్చామని..చంద్రబాబును మాత్రం నమ్మవద్దంటూ సూచించారు.

 టీడీపీలో గుర్తింపు దక్కక పోవటంతో..

టీడీపీలో గుర్తింపు దక్కక పోవటంతో..

అయితే, రాధాకృష్ణకు టీడీపీలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం సాగింది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేసారు. అమరావతి లో జరుగుతన్న మూడు రాజధానుల వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. కానీ, టీడీపీలో ఆయనకు పార్టీ పరంగానూ ఎటువంటి హోదా లభించలేదు. విజయవాడ నగర టీడీపీ నేతల్లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇదే సమయంలో రాధాకృష్ణ కు మిత్రుడు అయిన ఒక మంత్రి..వైసీపీ మిత్రులతో వంగవీటి రాధాకృష్ణ టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. తనకు కొంత సమయం ఇవ్వాలని ఆయన కోరుతున్నట్లుగా సమాచారం. ఈ డిసెంబర్ తరువాత నిర్నయం తీసుకుంటానని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయవాడ పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం రాధా తిరిగి వైసీపీలో చేరుతారంటూ ప్రచారం మొదలైంది. దీంతో.. టీడీపీ నుంచి ఈ నేతల వలసలు సెప్టెంబర్ లో ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు.

English summary
Senior two Kapu leaders ready to leave TDP and join YCP shortly.As per sources both leaders are in touch with ysrcp and shortly will announce their decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X