వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్‌లోకి వలసలు: టిటిడిపి నేతల సమీక్ష(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు బొడికుంటి వెంకేటశ్వర్లు, సలీంలు బుధవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సమక్షోంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు.

తెలంగాణలో పార్టీని కిందిస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా కార్యాచరణకు ఉపక్రమించాలని తెలంగాణ టిడిపి నేతలు సమావేశంలో నిర్ణయించారు. అధికార పార్టీ ప్రలోభాలకు ఒకరిద్దరు నాయకులు పార్టీని వీడినప్పటికీ పెద్ద నష్టమేమీ లేదని టిటిడిపి నాయకులు అభిప్రాయపడ్డారు.

శాసనమండలిలో మెజార్టీ లేనందునే తమ పార్టీ ఎమ్మెల్సీలను టిఆర్ఎస్ ఆకర్షిస్తోందని, అందువల్లనే తాజాగా టిడిపి సభ్యులు ఇద్దరు వలస వెళ్లారని టిడిపి నేత ఒకరు చెప్పారు. వలసలు ఒకరిద్దరితో ఆగకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకరిద్దరు నేతలు పార్టీని వీడినంత మాత్రాన తమ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని టిటిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు.

అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్.. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష పార్టీలను చీల్చడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. బంగారు తెలంగాణ అంటే వలసలను ప్రోత్సహించడమేనా అని రమణ ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా సమర్థవంతంగా వ్యవహరిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడాలని సమావేశంలో నిర్ణయించినట్లు టిడిపి నేతలు అరవింద్ కుమార్ గౌడ్, సీతక్క, అరికెల నర్సారెడ్డిలు తెలిపారు.

వలసలపై సమీక్ష

వలసలపై సమీక్ష

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు బొడికుంటి వెంకేటశ్వర్లు, సలీంలు బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

వలసలపై సమీక్ష

వలసలపై సమీక్ష

తెలంగాణలో పార్టీని కిందిస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా కార్యాచరణకు ఉపక్రమించాలని తెలంగాణ టిడిపి నేతలు సమావేశంలో నిర్ణయించారు.

వలసలపై సమీక్ష

వలసలపై సమీక్ష

ఒకరిద్దరు నేతలు పార్టీని వీడినంత మాత్రాన తమ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని టిటిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు.

వలసలపై సమీక్ష

వలసలపై సమీక్ష

అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్.. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష పార్టీలను చీల్చడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. బంగారు తెలంగాణ అంటే వలసలను ప్రోత్సహించడమేనా అని రమణ ప్రశ్నించారు.

వలసలపై సమీక్ష

వలసలపై సమీక్ష

ప్రతిపక్ష పార్టీగా సమర్థవంతంగా వ్యవహరిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడాలని సమావేశంలో నిర్ణయించినట్లు టిడిపి నేతలు అరవింద్ కుమార్ గౌడ్, సీతక్క, అరికెల నర్సారెడ్డిలు తెలిపారు.

English summary
Telangana Telugudesam Party senior leaders on Wednesday met at NTR Bhavan. And they reviewed of their party mlc's joinings in Telangana Rashtra Samithi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X