హ్యూమన్ టచ్ పోయింది: చంద్రబాబు కోటరీ..ఆర్టీజీఎస్ ఓడించాయి: నేతల నోట నిప్పు లాంటి నిజాలు..!
తాజా ఎన్నికల్లో టీడీపీ ఓటమి గురించి ముందే అంచనా వేసామని పార్టీ నేతలు కుండ బద్దలు కొట్టారు. తమకు వాస్త వాలు చెప్పే అవకాశం ఇవ్వలేదని వాపోయారు. పార్టీలో కొందరు నేతల అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పైన ప్రభావం చేసిందని నేతలు అధినేత దృష్టికి తీసుకొచ్చారు. రియల్ టైం నివేదికలు కొంప ముంచాయని..అధినేత వద్ద ఉండే కోటరీ నేతలకు ..సీఎం మధ్య గ్యాప్ పెంచిందని నేరుగా చంద్రబాబు ముందే తేల్చి చెప్పారు. అధినేత మాత్రం పార్టీ నేతలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయగా.. నేతలు మాత్రం ఇంకా ఓటమి ప్రభావం నుండి బయట పడటం లేదు.

ఓటమికి అధినేత కోటరీయే కారణం..
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఓటమికి గల కారణాల పైన సమీక్షించారు. మొత్తం
జిల్లల నేతలు హాజరయ్యారు. ఓటమికి కారణాలను ఇప్పటి వరకు దిగి మింగి ఉన్న నేతలు ఒక్కసారిగా అధినేత ముందు నోరు విప్పారు. వాస్తవాలను చంద్రబాబు సమక్షంలోనే కుండ బద్దలు కొట్టారు. పార్టీ సీనియర్ నేత అశోక్ గజ పతి రాజు సైతం అసంతృప్తి వ్యక్తం చేసారు. క్షేత్ర స్థాయి వాస్తవాలు విడిచి..తప్పుడు సమాచారం పైనే ఆధారపడ్డారని ఆవేదన వ్యక్తం చేసారు. వేలాది మందితో టెలి కాన్ఫిరెన్స్‌ల వలన వాస్తవాలు చెప్పే అవకాశం లేకుండా పోయిందని వాపోయారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రచారం చేసుకున్న రియల్ టైం గవర్నెన్స్‌లు ఇచ్చిన సర్వే నివేదికలు పార్టీ కొంప ముంచాయని..వాస్తవాలను మరిచి భ్రమల్లో ఉండేలా ఈ నివేదికలు ప్రభావం చూపాయని ఫైర్ అయ్యారు.

హ్యూమన్ టచ్ లోపించింది..
పార్టీ ఓటమికి ప్రధాన కారణం పార్టీలో హ్యూమన్ టచ్ లేకపోవటమేనని జూపూడి ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అధినేతకు పార్టీ నేతలకు..కార్యకర్తలకు భారీ గ్యాప్ వచ్చిందని ఇది ఎన్నికల సమయంలో తీవ్ర ప్రభావం చూపించదని ఆవేదన వ్యక్తం చేసారు. అధినేతను కలిసి వాస్తవాలు చెప్పే అవకాశం కూడా లేకుండా కొందర నేతలు చేసారని చెప్పుకొచ్చారు.
2004లోనూ..ఇప్పుడూ కొందరు అధికారులను పక్కన పెట్టుకొని వారు ఇచ్చే సమాచారం..వారి మాటలకే విలువ ఇవ్వ టం వలన ఇటువంటి ఫలితం వచ్చిందని ఎమ్మెల్సీ శ్రీనివాసులు పేర్కొన్నారు. సినీ నటి దివ్యవాణి ఈ సమీక్షలో నేరు గా మాజీ స్పీకర్ కోడెల కుటుంబం అంశాన్ని ప్రస్తావించారు. ఆ కుటుంబ దౌర్జన్యాలు పార్టీ మీద అన్ని ప్రాంతాల్లోనూ ప్రభావం చూపించాయని వ్యాఖ్యానించారు. అధినేత వద్ద ఉన్న కోటరీ..ఎవరినీ దగ్గరకు రానీయకుండా దూరం పెం చిందని అదే నేతలు వెళ్లిపోవటానికి కారణమైందని చెప్పుకొచ్చారు.

జగన్ పాలన బాగానే ఉంది..
ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా జగన్ పాలన బాగానే ఉందని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే విధంగా జగన్ పాలన కొనసాగితే తాము మద్దతు ఇస్తామన్నారు. తాను టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్తున్నామనే ప్రచారం నిజం కాదని చెప్పారు. ఇవిఎంల పని తీరు పైన అనుమానాలు ఉన్నాయని..వీటి పైన పోరాటం చేస్తామన్నారు. తమ నియోజకవర్గంలో తామిద్దరం కలిసి పని చేసినా.. ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందో విశ్లేషణ చేస్తున్నామని..ఇతరత్రా కారణాలు సైతం ప్రభావితం చేసాయని అంగీకరించారు. చంద్రబాబు..పార్టీ మధ్య గ్యాప్ వచ్చిందని..దీనిని భర్తీ చేయక పోతే రానున్న రోజుల్లో మరిన్ని సమస్యలు..మరింత నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఇతర నేతలు సైతం తమ అభిప్రాయాలను అధినేత ముందు స్పష్టం చేసారు.
-
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications