ధర్మవరం టికెట్ నాదే.. కాదూ కూడదు అంటే టీడీపీకి గుడ్ బై.. పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల హీట్ మైదలైంది. అధికార, విపక్ష పార్టీలలోని నేతలు ఆయా అసెంబ్లీ నియోజవర్గాల్లో టికెట్ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు, అనంతపురం జిల్లా, తెలుగుదేశం పార్టీ ధర్మవరం ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ధర్మవరం టికెట్ తనకు కాదని మరొకరికి ఇస్తే టీడీపీకి గుడ్ బై చెప్పి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ప్రకటించారు.

నేను చెప్పినా.. చంద్రబాబు దగ్గరికి వెళ్లినా చెప్పినా ఒకటే
అనంతపురం జిల్లాకు పరిటాల రవీంద్ర కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. ముఖ్యంగా రాప్తాడు, ధర్మవరంలోని చాలా మండలాల్లో వారిదే పైచేయి. వారు ఎంత చెబితే అంతే అన్న విధంగా ప్రజలు నడుచుకుంటారు. పరిటాల కుటుంబానికి అంత విలువ ఇస్తారు అక్కడి జనం. అయితే, తాజాగా గౌరవ సభ- ప్రజా సమస్యల చర్చ వేదికలో మాజీ ఎమ్మెల్యే సూరిని ఉద్దేశించి పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం టికెట్ ను తాను వదులుకునేది లేదని స్పష్టం చేశారు. తాను చెప్పినా ఒకటే, చంద్రబాబు దగ్గరికి వెళ్లినా చెప్పినా ఒకటే పేర్కొన్నారు.

ఆదే జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటా
ధర్మంవరంలో కొంతమంది మీటింగ్‌లు పెట్టి టికెట్ తెచ్చుకుంటామని కాల్ ఎగురేస్తున్నారని అన్నారు. ఒకవేళ వారు టికెట్ తెచ్చుకుంటే తాను టీడీపీకి గుడ్ బై చెప్పి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని పరిటాల శ్రీరామ్ ప్రకటించారు. పార్టీలోకి ఎవరు వచ్చినా కండువా వేసి ఆహ్వానిస్తామన్నారు. కష్టపడి పనిచేస్తే పార్టీలో పదవులు ఇప్పిస్తామని తెలిపారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీని ఎలా అభివద్ధి చేయాలి.? గ్రామాలను ఎలా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలని అన్న విధంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు శ్రీరామ్..

ధర్మవరంలో శ్రీరామ్.. రాప్తాడులో సునీతమ్మ
వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నుంచి బరిలోకి దిగాలని పరిటాల శ్రీరామ్ భావిస్తున్నారు. ఇప్పటి నుంచే గ్రామాల్లో తిరుగుతూ ప్రజలు, కార్యకర్తలతో మమేకమవుతున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో శ్రీరామ్ రాప్తాడు నుంచి పోటీ దిగారు. అక్కడ వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలైయ్యారు. ఈసారి రాప్తాడు నుంచి తన తల్లి , మాజీ మంత్రి సునితమ్మ పోటీ చేస్తుందని శ్రీరామ్ తెలిపారు. ధర్మవరం టికెట్ పై పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. మరి దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి..

వైసీపీ నేతలకు వార్నింగ్
2024లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అన్నారు శ్రీరామ్. అధికారంలోకి రాగానే వైసీపీ నేతల పనిపడతామని వార్నింగ్ ఇచ్చారు. వీదేశాల్లో దాకున్నా బయటకు తీసుకువస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో వాలంటీర్లు వైసీపీ నేతల్లాగా వ్యవహరిస్తున్నారని పద్ధతు మార్చుకోవాలని హితవు పలికారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications