వైసీపీ కోటరీ బాగుపడేలా బడ్జెట్.. మోసాల రెడ్డితో రాష్ట్రం నాశనం : జగన్ సర్కార్‌పై లోకేష్ ఫైర్

వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై టీడీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇది పేదవారికి వ్యతిరేక బడ్జెట్ అని విమర్శించింది. వైసీపీ కోటరీ బాగుపడాలన్న రీతిలోనే ఈ బడ్జెట్ ఉందని దుయ్యబట్టారు. పాత పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తున్నారని ఆరోపించింది. ఆర్థిక ఉగ్రవాదం ద్వారా రాష్ట్ర సంపదను కొల్లగొడుతోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల‌తో జ‌గ‌న్ పబ్బం గడుపుతూ.. ప్రజలను మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. చేతగా గాని దద్దమ్మ పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టింది.

కాగితాల ప్రకటనకే బడ్జెట్ ప‌రిమ‌తం

కాగితాల ప్రకటనకే బడ్జెట్ ప‌రిమ‌తం

రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులకు ఖర్చులకు ఎక్కడా పొంతన లేకుండా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. తెచ్చిన డబ్బులను ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాగితాల ప్రకటనకే రాష్ట్ర బడ్జెట్ పరిమితమతోందని విమర్శించారు. బడ్జెట్‌లో బీసీల ఊసే లేదని ఆరోపించారు. అన్నివర్గాలకు ఇచ్చే సంక్షేమ పథకాలను కూడా ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఇస్తున్నట్లు చూపడం దుర్మార్గమని దుయ్యబట్టారు.

 అమ్మ ఒడి అబద్ధం.. నాన్న బుడ్డి నిజం

అమ్మ ఒడి అబద్ధం.. నాన్న బుడ్డి నిజం


ప్రజలను మోసం చేస్తూ వైపీపీ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కాదు... మోసపు రెడ్డిగా మారాడని ఎద్దేవా చేశారు. అమ్మ ఒడి అబద్ధం.. నాన్న బుడ్డి నిజమని సెటైర్లు వేశారు. హాజరు పేరుతో అమ్మఒడిలో కోతలు పెట్టారని ఆరోపించారు. వాహన మిత్ర అబద్ధం.. డ్రైవర్లను మోసం చేయడమనేది నిజమని నిప్పులు చెరిగారు. సంక్షేమ కార్యక్రమాలకు కోతలు పెడుతోందని ఆరోపించారు.

 3రాజ‌ధానిని నాశ‌నం చేసి..

3రాజ‌ధానిని నాశ‌నం చేసి..


రాజధాని అమరావతిని జగన్ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను రెచ్చగొట్టారని దుయ్యబట్టారు. అమరావతికి ఒక్క రూపాయి కేటాయించలేదని మండిపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని హైకోర్టు చెప్పినా పట్టించుకోలేదని ఆయన ఆగ్రహ వ్యక్తం చేశారు. పన్ను రూపేణా ఆదాయం పెంచుకుంటున్నారని విరుచుకుపడ్డారు.

బడ్జెట్ నిధులు తాడేపల్లి ప్యాలెస్‌కు

బడ్జెట్ నిధులు తాడేపల్లి ప్యాలెస్‌కు


రాష్ట్ర బడ్జెట్‌కు చట్టబద్ధత ఉందో లేదో అన్నట్లు వైసీపీ ప్రభుత్వం వ్యవహారిస్తోందని టీడీపీ ఎమ్మెల్య గోరంట బుచ్చయ్య చౌదరి విమర్శించారు. బడ్జెట్ నిధులు తాడేపల్లి ప్యాలెస్‌కు మల్లుతున్నాయని ఆరోపించారు. లెక్కా పత్రం లేకుండా ఖర్చు చేస్తున్న నిధులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్నిఅమ్మకానికి పెట్టేసింది. ఇక ఏం మిగలేదని దుయ్యబట్టారు. ప్రజలపై విచ్చలవిడిగా పన్నులు వేసి దోచుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాక్షస పాలనకు ప్రజలు బలవుతున్నారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+