మరో ఛాన్స్ చేజార్చుకున్న టీడీపీ ? అందినట్టే అంది మిస్ ! ఇక 2024 కోసం ఆగాల్సిందే!

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాల్లో ఓ భారీ మలుపు లభిస్తుందని ఊహించిన వారందరికీ నిరాశ తప్పలేదు. ముఖ్యంగా మూడేళ్లు పూర్తి చేసుకున్న వైసీపీ సర్కార్ పై పైచేయి సాధించేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలన్నీ వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో ఈసారి అయినా చంద్రబాబు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావించినా అలా జరగలేదు. దీంతో వైసీపీ ఊపిరి పీల్చుకుంటోంది.

జగన్ కేబినెట్ ప్రక్షాళన

జగన్ కేబినెట్ ప్రక్షాళన

ఏపీలో జగన్ కేబినెట్ ప్రక్షాళన చేపడతారని సంకేతాలు అందగానే టీడీపీ ఒక్కసారిగా యాక్టివ్ అయింది. జిల్లాల వారీగా జగన్ కేబినెట్లో చోటు దక్కించుకోబోతున్న మంత్రులు, పదవులు కోల్పోతున్న మంత్రులపై భారీ కసరత్తే చేసింది. జగన్ ఎప్పటిలాగే సాఫీగా కేబినెట్ విస్తరణ చేసేస్తారనే అంచనాలున్నా ఎక్కడో చోట తమకు అవకాశం దక్కకపోతుందా అని ఎదురుచూసింది. కానీ టీడీపీ ఆశలు మాత్రం ఫలించలేదు. దీంతో నిరాశగా నిట్టూర్చడం మినహా చేసేదేమీ లేకుండా పోయింది.

 గోల్డెన్ ఛాన్స్ మిస్

గోల్డెన్ ఛాన్స్ మిస్

జగన్ కేబినెట్లో చోటు కోల్పోతున్న వారిసంఖ్య ఎక్కువగా ఉంటుందని టీడీపీ అంచనావేసుకుంది. జిల్లాలవారీగా చూసుకుంటే ఎక్కువ మందికి అవకాశాలు కల్పించాల్సిన పరిస్ధితుల్లో జగన్ దాదాపు కేబినెట్ లో అందరినీ మార్చేయడం ఖాయంగా కనిపించింది. దీంతో పాటు కొత్తగా కేబినెట్లో చోటు కోసం భారీగా పోటీ నెలకొంది.

ఈ నేపథ్యంలో అసంతృప్తుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందని టీడీపీ అంచనా వేసింది. అనుకున్నట్లుగానే జగన్ కేబినెట్ మంత్రులందరితో రాజీనామాలు చేయించేశారు. దీంతో వీరిలో కొందరు టీడీపీలో టచ్ లోకి కూడా వెళ్లారు. అయితే చివరి నిమిషంలో మారిన సీన్ తో వీరిని జగన్ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీడీపీకి గోల్డెన్ ఛాన్స్ మిస్సయింది.

 టీడీపీ వ్యూహానికి జగన్ చెక్

టీడీపీ వ్యూహానికి జగన్ చెక్

కేబినెట్ ప్రక్షాళన నేపథ్యంలో ఉన్న మంత్రులందరితో రాజీనామాలు చేయించేసిన జగన్.. వీరిలో కొందరు టీడీపీతో టచ్ లోకి వెళ్తారని జగన్ ఊహించలేదు. అధికారంలో ఉన్న పార్టీని వదిలి విపక్ష టీడీపీ వైపు వెళ్లే అవకాశాలు ఉండబోవనే అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మంత్రి పదవులు కోల్పోయిన తర్వాత వైసీపీ గెలుపు అవకాశాలు భుజాలపై వేసుకోవాలని జగన్ కోరడంతో వారు అందుకు సుముఖతచూపలేదు.

దీంతో టీడీపీతో టచ్ లోకి వెళ్లారు. విషయం తెలియగానే జగన్ అప్రమత్తం అయ్యారు. అలాంటి వారిని గుర్తించి కేబినెట్లో కొనసాగింపు ఇచ్చేశారు. ఆ మేరకు కొత్త మంత్రుల్ని తీసుకునేందుకు వీల్లేకుండా పోయినా జగన్ వెనక్కి తగ్గలేదు. దీంతో టీడీపీ ప్లాన్ ఫెయిలైంది.

2024 వరకూ ఆగాల్సిందే?

2024 వరకూ ఆగాల్సిందే?

ప్రస్తుతం జగన్ కేబినెట్ ప్రక్షాళన పూర్తయిపోయింది. కొత్తగా కేబినెట్ లోకి వచ్చిన మంత్రులు కూడా ఎక్కడికక్కడ కుదురుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అప్పటికే కేబినెట్ లో మంత్రి పదవులు కోల్పోయిన చోట కొత్త మంత్రులకు వారి నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ అసంతృప్తుల్ని గమనించి వైసీపీ అధిష్టానం వారితో టచ్ లోకి వెళ్తోంది.

జగన్ నేరుగా నెల్లూరు జిల్లా నేతల్ని పిలిపించి మాట్లాడుతున్నారు. ఇదే పరిస్ధితి కొనసాగితే 2024 వరకూ టీడీపీకి అవకాశాలు దొరకడం కష్టమేనని తెలుస్తోంది. ఎన్నికల ఏడాదిలో మాత్రం వైసీపీ అసంతృప్తులు టీడీపీవైపు మొగ్గే ఛాన్స్ ఉండొచ్చు. అప్పటివరకూ టీడీపీ, చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు బ్రేక్ ఇచ్చి జనంలో తిరగాలని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+