హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి మహానాడు: స్వర్గీయ ఎన్టీఆర్ వివాహ శుభలేఖ ఆకర్షణ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మూడు రోజుల మహానాడు బుధవారంనాడు ఉదయం హైదరాబాదులో ప్రారంభమైంది. యేటా టిడిపి మహానాడు ఇవే తేదీల్లో జరుగుతాయి. వేదికపై తెలంగాణకు చెందిన కాకతీయ స్తూపం, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చిహ్నాలను ఉంచారు.

టీడీపీ నిబంధనావళిలో మార్పులు చేశారు. జాతీయ పార్టీగా మారుస్తూ తీర్మానం చేశారు.

మహానాడులో జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని టీడీపీ ఎమ్మెల్యే బొండ ఉమ తెలిపారు. ఇరు రాష్ట్రాలకు కమిటీలు వేశామన్నారు. లోకేషఅ సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలన్నారు.

ఈ రోజు కార్టూన్ ; మహానాడు ఫోటోలు

TDP Mahanadu: Harikrishna reaches to the venue

తన అధ్యక్షోపన్యాసంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అని ఆయన చెప్పారు. విభజనను కోరుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాల్సిందేనని, అయితే ఆంధ్రకు న్యాయం చేయాలని తాను అంటూ వచ్చానని ఆయన అన్నారు. అయితే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని తిరిగి బలోపేతం చేసే విషయంపై ఆయన పెద్దగా మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను చేపడుతున్న కార్యక్రమాలపై ఎక్కువగా ప్రస్తావించారు.

రాజధాని అమరావతి గురించి, నదుల అనుసంధానం గురించి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వర్గాల కోసం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. విభజన తీరును ఆయన ఆయన తప్పు పట్టారు.

TDP Mahanadu: Harikrishna reaches to the venue

పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య నివేదికను సమర్పించారు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షోపన్యాసం ప్రారంభించారు.

గండిపేటలో జరుగుతున్న తెలుగుదేశం 34వ మహానాడులో పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు పెళ్లి శుభలేఖ ప్రత్యేక ఆర్షణగా నిలిచింది. 1942 మే 2న కృష్ణాజిల్లా కొమరవోలులో ఎన్టీఆర్‌, బసవతారకం వివాహం జరిగింది. వీరి పెళ్లిపత్రికను మహానాడు ఫోటో ఎగ్జిబిషన్‌ వద్ద ఏర్పాటు చేయడంతో కార్యకర్తలంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయన వేదిక మీదికి చేరుకున్నారు. ఎన్టీ రామారావు విగ్రహానికి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.

TDP Mahanadu: Harikrishna reaches to the venue

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. చంద్రబాబుకు నాయకులు స్వాగతం పలికారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను, రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నారా లోకేష్ హైలెట్‌గా నిలిచాడు.

బుధవారం ఉదయం మాజీ పార్లమెంటు సభ్యుడు నందమూరి హరికృష్ణ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ మహానాడులోని చంద్రబాబును టిడిపి జాతీయాధ్యక్షుడిగా ఎన్నుకుంటారు.

TDP Mahanadu: Harikrishna reaches to the venue

టిడిపిని జాతీయ పార్టీగా ప్రకటిస్తూ ఈ మాహానాడులో తీర్మానాన్ని ఆమోదిస్తారు. ఎపికి సంబంధించి 14, తెలంగాణకు సంబంధించి పది తీర్మానాలను మాహానాడులో చేరుస్తారు. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై మహానాడులో తీర్మానం చేయనున్నారు. అదే విధంగా నారా లోకేష్ పనితీరును ప్రశంసిస్తూ మరో తీర్మానం చేసే అవకాశం ఉంది. గుర్తింపు కార్డులు ఉన్నవారినే ప్రాంగంణంలోకి అనుమతిస్తున్నారు. ఈ మహానాడుకు 20 వేల నుంచి 30 వేల వరకు ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దీంతో 24 రకాల వంటకాలతో 35 వేల మందికి భోజనాలు తయారు చేస్తున్నారు.

నస్సజనం నియంత్రణ, విద్యుత్తులపై తీర్మానాలు చేయనున్నారు. లోకేష్‌కు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ టిడిపి నాయకుడు పయ్యావుల కేశవ్ అన్నారు. నాయకులకు డప్పులతో స్వాగతం పలుకుతున్నారు.

English summary
Nandamuri Harikrishna and Nara Lokesh reached venue of Telugudesam party (TDP) Mahanadu in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X