వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వచ్చే లోపు!: ఆ పని పూర్తి చేయాలనుకుంటున్న టీడీపీ?, అదే జరిగితే పెద్ద దెబ్బే

జగన్ వచ్చేలోపు ఆ పార్టీకి డ్యామేజ్ చేయగలిగితే.. మున్ముందు తమ పని మరింత సులువు అవుతుందని భావిస్తోంది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

TDP Expecting YSRCP MLAs Joinings జగన్ వచ్చేసరికి ఎమ్మెల్యేలు జంప్, వైసిపికి షాక్: అందుకే?| Oneindia

విజయవాడ: నంద్యాల, కాకినాడల్లో వరుస పరాభవాలు.. నేతల్లో గూడుకట్టుకున్న అభద్రతా భావం.. వెరసి పార్టీ భవిష్యత్తుపై ఆందోళనలో వైసీపీ. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష పార్టీ పరిస్థితి ఇది. వరుస ఓటములతో ఢీలా పడ్డ నాయకులను ఆకర్షించేందుకు అటు టీడీపీ కూడా మైండ్ గేమ్ మొదలుపెట్టేసింది.

వాట్ నెక్స్ట్: వైసీపీ ఫ్యూచర్ స్ట్రాటజీ?, మళ్లీ అదే తప్పా.. టీడీపీకి అది ప్లస్!వాట్ నెక్స్ట్: వైసీపీ ఫ్యూచర్ స్ట్రాటజీ?, మళ్లీ అదే తప్పా.. టీడీపీకి అది ప్లస్!

ఇలాంటి తరుణంలో వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటనకు వెళ్తుండటం టీడీపీకి కలిసొచ్చే అంశంగా మారిందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన కొంతమంది నేతలు తమతో టచ్‌లో ఉన్నారని చెబుతున్న టీడీపీ.. జగన్ లేని సమయాన్ని అందుకోసం ఉపయోగించుకోవాలని భావిస్తోంది.

నయానో.. భయానో:

నయానో.. భయానో:

వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ ఉనికిని పూర్తిగా ప్రశ్నార్థకం చేయాలన్న కృతనిశ్చయయంతో ఉన్న అధికార పార్టీ.. ఇప్పటినుంచే ఆపరేషన్ ఆకర్ష్ ప్లాన్ ను అమలు చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. వరుస ఓటముల తర్వాత వైసీపీ నేతల్లోను భవిష్యత్తుపై బెంగ ఏర్పడటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశంగా మారింది. నయానో.. భయానో.. వారిని పార్టీలోకి చేర్చుకుంటే.. 2019ఎన్నికల్లో జగన్ ప్రభావాన్ని తగ్గించవచ్చనేది వారి ఆలోచనగా తెలుస్తోంది.

జగన్ వచ్చేలోపు:

జగన్ వచ్చేలోపు:

జగన్ పెద్ద కూతురు హర్షకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో సీటు వచ్చినందునా.. ఆమెను జాయిన్ చేసేందుకు జగన్ సోమవారం లండన్ వెళ్తున్నారు. తిరిగి 19వ తేదీన ఆయన ఏపీకి వస్తారు. ఈ ఎనిమిది రోజుల గ్యాప్ లో.. వైసీపీలో ప్రకంపనలు పుట్టించాలని టీడీపీ భావిస్తోంది. జగన్ వచ్చేలోపు ఆ పార్టీకి డ్యామేజ్ చేయగలిగితే.. మున్ముందు తమ పని మరింత సులువు అవుతుందని భావిస్తోంది.

ఆకర్షించే ప్రయత్నాలు:

ఆకర్షించే ప్రయత్నాలు:

ఒకవేళ చేరికలు ఇప్పుడే ఉండకపోయినా.. జగన్ లేని ఈ గ్యాప్ లో ఫిరాయింపు మంతనాలు వేగవంతం చేయాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి ఏదొక హామి ఒకరిద్దరిని పార్టీలోకి లాగగలిగితే.. ఆ తర్వాత చాలామంది క్యూ కడుతారని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఇదంతా ఊహాగానాలకే పరిమితమవుతుందా? లేక కార్యరూపం దాలుస్తుందా? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఏదేమైనా జగన్ లేని సమయంలో వైసీపీని దెబ్బ కొట్టడానికి టీడీపీ కాచుకు కూర్చుందనేది మాత్రం స్పష్టమవుతోంది.

జగన్ మరో తప్పిదం?:

జగన్ మరో తప్పిదం?:

నిజానికి నంద్యాల, కాకినాడ ఓటముల తర్వాత వైసీపీలో స్వీయ సమీక్ష కొరవడిందన్న విమర్శ ఉంది. ఇప్పుడు గనుక నేతలు టీడీపీలోకి ఫిరాయిస్తే.. ఆ విమర్శలకు మరింత బలం చేకూరుతుంది. నేతల్లో ఆత్మన్యూనతను పోగొట్టే బాధ్యతను జగన్ తీసుకోకపోవడం వల్లే ఫిరాయింపులకు ఆస్కారం ఏర్పడే అవకాశం ఉంది. జగన్ ఇలాగే వ్యవహరిస్తే మరో వ్యూహాత్మక తప్పిదం చేసినట్లే అవుతుంది. కాబట్టి జగన్ ఇప్పటికైనా పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేయాలంటున్నారు. లేదంటే భవిష్యత్తు మరింత ప్రతికూలంగా ఉంటుందనేది చాలామంది వాదన.

English summary
Its an interesting discussing circulating in AP Politics that tdp may implements operation akarsh in jagan absence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X