ఇంత జరుగుతోందా?: 'పవన్'తో బాబు వ్యూహాత్మకంగా!, జగన్‌కు కష్టాలేనా?

Subscribe to Oneindia Telugu

విజయవాడ: ప్రస్తుత రాజకీయాల్లో మీడియాకు ఉన్న ప్రాధాన్యం గురించి ఎంత చెప్పినా తక్కువే!. తమ అనుకూల నేతలను వెనుకేసుకు రావడానికి, జనంలో వారి పట్ల స్థిరాభిప్రాయం పెంపొందేలా చేయడానికి వాటి ప్రయత్నం అవి ఎప్పుడూ చేస్తూనే ఉంటాయి. ఒకవేళ పరిస్థితులు బెడిసికొట్టి జనం ప్రత్యర్థి వైపు మళ్లుతున్నారని తెలియగానే.. ప్రత్యామ్నాయంగా తమకు అనుకూలంగా ఉండే మరో నేతను తెరపైకి తీసుకొస్తాయి.

ఏం చేసైనా సరే, అధికార పార్టీ మైనస్‌లు ప్రత్యర్థి ఖాతాలోకి చేరకుండా జాగ్రత్తపడుతాయి. ఏపీ రాజకీయ, దాని అనుబంధ మీడియా తీరు తెన్నులను గమనిస్తే ఇప్పుడిదే విషయం స్పష్టమవతున్నది. నిన్న మొన్నటిదాకా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన ఆ పార్టీ అనుకూల మీడియా ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు ప్రాధాన్యం పెంచిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

జనంలో ప్రభుత్వం పట్ల మొదలైన వ్యతిరేకతను ఎట్టి పరిస్థితుల్లోను జగన్ ఖాతాలోకి వెళ్లనివ్వకుండా ఉండేందుకే సదరు టీడీపీ అనుకూల మీడియా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను తెర పైకి తీసుకొచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో ముందుగానే ఈ మీడియా మేల్కొన్నట్లుగా తెలుస్తోంది.

tdp media special focus on pawan kalyan for future politics

అనుకున్నట్లుగా పవన్ కళ్యాణ్‌కు హైప్ ఇవ్వడం ద్వారా జగన్ ఇమేజీ తెర మరుగు చేయవచ్చునన్నది దీని వెనుక ఉన్న వ్యూహంగా తెలుస్తోంది. ఎటూ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అనుకూలంగా ఉండే వ్యక్తే కావడంతో.. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో జనసేన సత్తా చాటినా.. పొత్తుకు కూడా ఇది లాభిస్తుందనేది సదరు మీడియా వర్గాల లెక్క అని పరిశీలకులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక తన అనుబంధ సండే బుక్‌లో పవన్ కళ్యాణ్ పై ఏకంగా ఐదు పేజీల కవర్ స్టోరీని ముద్రించింది. ఇక నిన్నటి కాటమరాయుడు ఆడియో ఫంక్షన్ కు సైతం ఓ ప్రముఖ టీవి చానెల్ అధినేత హాజరుకావడం పైన చెప్పుకున్న వాదనలకు ఊతమిస్తున్నాయి. రానున్న రోజుల్లో వీటి తీవ్రత మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు.

ఇదిలా ఉంటే, కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామి ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చాక దాన్ని నెరవేర్చలేక చంద్రబాబు కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ పట్ల కాపుల్లో కావాల్సినంత అసంతృప్తి గూడు కట్టుకుపోయింది. వారంతా ఇప్పుడు జగన్ వైపు మళ్లకుండా ఉండాలంటే.. పవన్ తెరపై ఉండటం చాలా అవసరమని సదరు మీడియా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మొత్తం మీద ఈ పరిణామాలన్నింటిని జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఇదంతా చంద్రబాబు తెర వెనుక వ్యూహామనేది చాలామంది నోట వినిపిస్తున్న మాట.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Its an interesting topic that TDP media was creating hype for Janasena President Pawan Kalyan. Few are saying that just the strategy of CM Chandrababu Naidu for 2019 elections
Please Wait while comments are loading...