భయంతో పరుగులు పెట్టిన టిడిపి ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ
విశాఖ: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణను తేనెటీగలు మంగళవారం నాడు పరుగు పెట్టించాయి. ఆయనతో పాటు ఆర్డీవో పద్మావతి సహా పలువురు అధికారులు, ఇతర నాయకుల పైన కందిరీగలు దాడి చేశాయి. దీంతో వారు పరుగు లంకించుకున్నారు.

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. నర్సాపురం వద్ద శారదా నది పైన ఉన్న ఆనకట్ట వద్ద వరద ఉధృతిని పరిశీలించేందుకు ఎమ్మెల్యే పీలా, ఇతర అధికారులు, నాయకులు తరలి వెళ్లారు. ఈ సమయంలో అక్కడ ఆనకట్ట నీటి ఉధృతిని పరిశీలించి వస్తుండగా ఓ రైతు పొదల్లో ఉన్న కందిరీగల తుట్టెను కదిపాడు.

దీంతో ఒక్కసారిగా లేచిన కందిరీకలు వారి పైన దాడి చేశాయి. దీంతో ఎమ్మెల్యే, ఇతరులు పరుగులు పెట్టారు. వారంతా కార్ల వద్దకు పరుగెత్తి కందిరీగల బెడద నుంచి తప్పించుకున్నారు. తీవ్రంగా గాయపడిన కొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో జెడ్పీటీసీ సభ్యురాలు, రెవెన్యూ సిబ్బంది గాయత్రి, కారు డ్రైవర్‌ను కందిరీగలు కుట్టాయి.












Click it and Unblock the Notifications