ప్రధాని మోదీ ఎదుటే కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్న టీడీపీ ఎమ్మెల్యే.. తరువాత రియాక్షన్ ఏమిటంటే..?

అధికార వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ ,జనసేన బీజేపీ కూటమి కట్టిన సంగతి అందరికి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆదివారం చిలకలూరిపేటలో కూటమి ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లతో పాటు ప్రధాని మోదీ ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. బహిరంగ సభకు హజరైన కూటమి ముఖ్య నేతలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ఇదిలా ఉంటే ఈ సభలో బాలకృష్ణ చేసిన ఓ చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాని మోదీ వేదిక మీద ఉండగానే బాలకృష్ణ కాలు మీద కాలు వేసుకున్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రధాని హోదాకు, మోదీ వయస్సుకు మీరిచ్చే ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

TDP MLA balakrishna sitting cross-legged in front of Prime Minister Modi

దీనిపై బాలయ్యకు మద్దతుగా కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బాలకృష్ణ బ్లడ్, బ్రీడ్ వేరని ఆయన ఎక్కడ ఉన్నా హుందాగా ఉండాలని ప్రయత్నిస్తారని.. తప్పు చేయనప్పుడు ఎవరికి తలవంచాల్సిన పనిలేదనే మనస్తత్వం ఆయనదని..అందుకే సభలో అలా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారని .. ఇందులో ఎలాంటి తప్పులేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఉన్నది ఉన్నట్టు చెప్పడం బాలకృష్ణకు అలవాటు.. మనస్సులో ఒకటి పెట్టుకుని .. పైకి అందరితో నవ్వుతూ మాట్లాడటం బాలకృష్ణకు చేతకాదని ఆయన అభిమానులు బాలకృష్ణకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే బాలకృష్ణ ఇలా చేయడం తొలిసారి కాదని గతంలో కూడా ఆయన చాలా సందర్భాల్లో ఇదే విధంగా చేశారని అధికార వైసీపీ నేతలు మండిపడుతున్నారు. బాలకృష్ణకు వ్యతిరేకంగా వైసీపీ దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది.

TDP MLA balakrishna sitting cross-legged in front of Prime Minister Modi

ఇక వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ హిందుపూరం నుంచి బరిలోకి దిగుతున్నారు. 2014,2019 ఎన్నికల్లో హిందుపూరం ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ..ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బాలకృష్ణను ఎలాగైన ఓడించేందుకు అధికార వైసీపీ వ్యూహాలు పన్నుతోంది. దీనిలో భాగంగానే బాలకృష్ణపై మహిళా అభ్యర్థి అయిన దీపికను రంగంలోకి దించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+