విజయవాడ సీన్ రిపీట్ కానివ్వం, తెలుగంగా, కేసీ కెనాల్ పై నిఘా, శిల్పాను వదలం, భూమా
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరదల దెబ్బకి పలు జిల్లా్లో నానా బీభత్సం సృష్టించా.యి విజయవాడను ముంచేసిన కృష్ణమ్మ శాంతించింది. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి తెలుగు సినీ ప్రముఖులు, పలు పార్టీల రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల్లో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నారు.
ఇదే సమయంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు సీఎం సహాయ నిధికి విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి భూమా అఖిల ప్రియా సీఎం సహాయ నిధికి 5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. గురువారం సాయంత్రం విజయవాడ చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

ఇప్పటికే ఆళ్లగడ్డ పురపాలక కమీషనర్, అళ్లగడ్డ పారిశుద్ధ కార్మికులు విజయవాడ చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇప్పుడు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా విజయవాడ చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భూమా శోభా నాగిరెడ్డి ట్రస్టు ద్వారా ఆంధ్రప్రదశ్ సీఎం సహాయ నిధికి ఐదు లక్షల రూపాయలు అందించామని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
తెలుగు గంగా, కేసీ కెనాల్ పరిధిలో ఎలాంటి అక్రమణలు ఉన్నా వాటిని వదిలిపెట్టమని, చట్టపరంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్లను మాత్రం వదిలిపెట్టమని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు శిల్ప వెంచర్స్ లో అక్రమణలు కూడా పూర్తిగా తొలగిస్తామని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన వదిలిపెట్టమని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా అన్నారు.
విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి ప్రతిరోజు వెయ్యి మందికి ఆహార పొట్లాలు అందిస్తామని టిడిపి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నార. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి గురువారం ఐదు లక్షల విరాళం ప్రకటించారు. సీఎం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని, వరద బాధితులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం శక్తి వంచనలేకుండా పని చేస్తోందని ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి అన్నారు. .












Click it and Unblock the Notifications