రైతులను కుక్కలతో పోల్చిన టీడీపీ ఎమ్మెల్యే(వీడియో)
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. తొలిసారి ఎమ్మెల్యే కావడంతో అవగాహనలేమి తనంతో ఆయన చేస్తోన్న పనులు పార్టీతో పాటు, ఇటు ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తీసుకువస్తోంది. రాష్ట్రంలో కూటమి విజయం సాధించగానే సదరు ఎమ్మెల్యే వైసీపీకి చెందిన నాయకుడు ఇంటిని కూల్చివేసి పెద్ద సీన్ క్రియేట్ చేశారు. డ్వాక్రా మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు టీడీపీ ఎమ్మెల్యేపై ఉన్నాయి. మహిళలను అధికారికంగా ఐదు గంటల పాటు పోలీస్‌స్టేషన్‌లో ఉంచి తన అధికార దర్పాన్ని ప్రదర్శించారాయన.దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేకు చీవాట్లు పెట్టడం జరిగింది. అయిన తీరు మార్చుకుని ఎమ్మెల్యే వరుస వివాదాల్లో నిలుస్తున్నారు.
రైతుల్ని కుక్కలతో పోల్చిన టీడీపీ ఎమ్మెల్యే..!#KolikapudiSrinivasaRao #TDP #Farmers #ViralVideo #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/f7huUWg2lh
— oneindiatelugu (@oneindiatelugu) October 3, 2024
ఇక ఇటీవలే ఎమ్మెల్యే కారణంగా టీడీపీ సర్పంచ్ భార్య అత్మహత్యయత్నం చేయడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.చిట్టేల టీడీపీ సర్పంచ్ శ్రీనివాస్‌ను టార్గెట్ చేసి బూతులు తిడుతూ.. ఆయనకు సిగ్గుంటే సర్పంచ్‌గా ఉంటాడా?. సర్పంచ్ కనపడితే చెప్పుతో కొడతానంటూ అసభ్యకర పదజాలంతో దూషించడం జరిగింది. సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇలా తమని టార్గెట్ చేయడంతో సర్పంచ్ ఫ్యామిలీ మనస్తాపానికి గురైంది. ఈక్రమంలోనే సర్పంచ్ శ్రీనివాస్‌ను ఇలా తిట్టడంతో ఆయన భార్య, వీఆర్వో కవిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన రైతుల గురించి అసభ్యకరంగా మాట్లాడారు.

రైతులను ఎమ్మెల్యే కుక్కలతో పోల్చారు. కుక్కలకు అయినా విశ్వసం ఉంటుంది కానీ, ఈ రైతులకు అది కూడా ఉండదనే విధంగా మాట్లాడిన ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్లే ధర్నాలు నిర్వహించారంటే నియోజకవర్గంలో పరిస్థితి ఎంతటి దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేను భరించలేమని నియోజకవర్గానికి కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించాలని, లేదంటే పార్టీ సర్వనాశనం అవుతుందని తిరువూరు టీడీపీ నాయకులు కొలికపూడిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు ఫిర్యాదు కూడా చేశారు. తీరు మార్చుకోవాలని ఇప్పటికే పలుమార్లు పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించినప్పటికీ ఎమ్మెల్యేలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. దీంతో ఆయనపై త్వరలోనే చర్యలు తీసుకోవడానికే పార్టీ అధిష్టానం రెడీ అవుతోందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications