ఆలు లేదూ.. చూలు లేదు- బీజేపీతో పొత్తుపై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య-అసలు జరిగిందిదే..!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాల పొత్తులపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. బీజేపీతో పొత్తులోనే ఉంటూ హఠాత్తుగా టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన ఇప్పుడు ఈ రెండు పార్టీల్ని కలిపే పనిలో ఉంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు బీజేపీ జాతీయనేతలు అమిత్ షా, జేపీ నడ్డా నుంచి పిలుపు వచ్చింది. దీంతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వారితో చర్చలు జరిపి వచ్చారు. అయితే ఈ భేటీలో ఏం తేలిందో చంద్రబాబు కానీ, బీజేపీ నేతలు కానీ వెల్లడించలేదు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చాక పార్టీ నేతలతో భేటీ అయి సుదీర్ఘంగా చర్చలు జరిపిన చంద్రబాబు.. త్యాగాలకు సిద్దం కావాలని మాత్రం సంకేతం ఇచ్చారు. పొత్తుల కారణంగా 15 నుంచి 20 సీట్లలో వెనక్కి తగ్గాల్సిన పరిస్ధితులు ఉండొచ్చని పార్టీలో ఆశావహులకు తేల్చిచెప్పేశారు. అయితే బీజేపీతో పొత్తు కుదిరిందా లేదా అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ తరుణంలో టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇవాళ నోరు విప్పారు.

ఢిల్లీలో బీజేపీతో చర్చలు ఫైనల్ కాలేదని, ఇందులో పొత్తుపై ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. ఇవాళ రాజమండ్రిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన బుచ్చయ్య.. ఎన్డీఏలోకి రీఎంట్రీపైనా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పేశారు. కేవలం బీజేపీతో చర్చలు మాత్రమే జరిగాయని, వాటిలో చర్చించిన అంశాలపై తుది నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని బుచ్చయ్య స్పష్టం చేశారు. దీంతో మరోమారు చర్చలు ఉంటాయా లేదా అన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications