అందుకే అంబటి ఇంటికి..! నెయ్యిపై వారంలో తేల్చేస్తాం: టీడీపీ ఎమ్మెల్యే..!
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి వ్యవహారంపై ఇందులో పాల్గొన్న గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి (madhavi)నోరు విప్పారు. ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆమె స్పందించారు. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైందని, వారం రోజులు ఓపిక పట్టండి, అన్ని విషయాలు మాట్లాడుకుందామంటూ మాధవి కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబును దూషించి, 'నేను అనలేదు' స్పర్ లో వచ్చింది అని అంబటి మాట మార్చడం హాస్యాస్పదమని గళ్లా మాధవి తెలిపారు. కార్యకర్తలను తాను రెచ్చగొట్టాననడానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయని ఆమె ప్రశ్నించారు. తాను దాడి చేయాలనుకుంటే మీరు టీడీపీ ఆఫీసుపై చేసినట్టు చేయించలేనా అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి పెమ్మసాని భార్యను రాజకీయాల్లోకి లాగడం ఎందుకని ప్రశ్నించారు. ఈ ఘటనతో సంబంధం లేని ఆమె ఎందుకు సమాధానం చెప్పాలన్నారు.

మహిళలపై దాడి గురించి మాట్లాడుతున్న అంబటి కుమార్తె, తమ మహిళా కార్యకర్తపై మీ ఆఫీస్ దగ్గర దాడి జరిగినప్పుడు తండ్రిని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. మీ నాన్న పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు కులం గుర్తుకు రాలేదా..? ఇప్పుడు కులాన్ని ఎందుకు వాడుకుంటున్నారు? అని అడిగారు. మేము మాట్లాడితే రెచ్చగొట్టినట్టా? మీరు మాట్లాడితేనేమో అది ప్రశ్నించడమా? అని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చాక జుట్టు పట్టుకుని బయటకు లాగుతామంటున్నారు జక్కంపూడి రాజా.. ఎందుకు? అని ప్రశ్నించారు. దమ్ముంటే ఈ నెల 11న మీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రండి.. అక్కడే తేల్చుకుందాం, 2029 వరకు ఎందుకన్నారు. మా ఎంపీని, నన్ను డమ్మీలు అన్నా భరించామని, కానీ ముఖ్యమంత్రిని దూషిస్తే క్షమాపణ అడగడంలో తప్పేముందన్నారు.












Click it and Unblock the Notifications