అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ ముందు రెండోరోజూ టీడీపీ నిరసన-జంగారెడ్డిగూడెం ఘటనపై విచారణ, పరిహారం కోరుతూ

|
Google Oneindia TeluguNews

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా తాగి 20 మందికి పైగా చనిపోయారని ఆరోపిస్తున్న ప్రధాన విపక్షం టీడీపీ.. దీనిపై ప్రభుత్వం స్పందించి న్యాయవిచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ కూడా అసెంబ్లీ ముందు నిరసన కొనసాగిస్తోంది. దీంతో పాటు సభలోనూ ఇవాళ మరోసారి గట్టిగా పట్టుబట్టాలని యోచిస్తోంది. దీంతో వరుసగా రెండోరోజు కూడా జంగారెడ్డిగూడెం ఘటన అసెంబ్లీని కుదిపేసేలా కనిపిస్తోంది.

జంగారెడ్డిగూడెం ఘటనలో జరిగినవి సహజమరణాలేనంటూ నిన్న ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళ ఉదయం అసెంబ్లీ ఎదుట నిరసన కొనసాగించారు.అవన్నీ ప్రభుత్ల హత్యలే అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కల్తీ సారా మరణాలను ప్రభుత్వం సహజ మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని వారు ఆరోపించారు. 26 మంది చనిపోతే ప్రభుత్వం లో కనీస చలనం లేదన్నారు. జంగారెడ్డిగూడెం మరణాల పై న్యాయ విచారణ జరిపించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు
25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరారు.

tdp mla, mlcs protest continues second day infront of assembly on jangareddygudem deaths

ఇవాళ ప్రదర్శనలో టీడీపీ ఎమ్మెల్సీ నారాలోకేష్ తో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీలో వాయిదా తీర్మానం కూడా ఇస్తున్నారు. జంగారెడ్డిగూడెం మరణాలను ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోందని, సభలో చర్చకు అంగీకరించే వరకూ తమ పోరాటం ఆగదని టీడీపీ ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ఇప్పటికే నిన్న సభలో జంగారెడ్డిగూడెం ఘటనపై మంత్రి ప్రకటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

English summary
tdp mlas and mlcs on today continue protests before ap assembly on jangareddygudem deaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X