వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ మూడేళ్లలో పీకింది ఇదే- స్ధాయికి తగని భాష- టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కౌంటర్

|
Google Oneindia TeluguNews

విపక్షాలను ఉద్దేశించి సీఎం జగన్ తాజాగా చేసిన పీకుడు వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా జగన్ భాషపై తీవ్రంగా స్పందించారు. నంద్యాలలో జగన్ చేసిన కామెంట్స్ పై పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి నంద్యాలలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి స్థాయికి తగని భాష ఎంచుకున్నారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఏం పీకుతావని కొత్తభాషకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రి ''ఎందుకీ పీకుడు భాష'' మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రజలంతా ఆలోచిస్తున్నారని ప్రశ్నించారు. పీకే ఇచ్చిన నివేదికలో తన పతనం ప్రారంభమైదని కనిపిస్తోందని, వాస్తవానికి, ఆయన ఊహలకు భిన్నంగా స్పష్టంగా కనబడుతోందన్నారు. తన బేలతనాన్ని, అసమర్ధతను కప్పిపుచుకోడానికే, భాషలో స్వరాన్ని జగన్ రెడ్డి పెంచుతున్నారని పయ్యావుల విమర్శించారు. మీ అసమర్ధతకు, వైఫల్యానికి వాస్తవ పరిస్థితులకు మీ భాషే అద్దం పడుతోందనన్నారు. భాషలో కాదు, పాలనలో మీ వేగాన్ని పెంచాలన్నారు.

tdp mla payyavula keshav counter attack on ys jagans wont pluck comments, ask what he

జగన్ వైఫల్యాలు కళ్ల ముదే ఉన్నాయని, ఇంటలిజెన్స్ నివేదికలు, పికే నివేదికలు వైఫల్యాలను బైటపెట్టాయన్నారు. వాటన్నింటినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జగన్ రెడ్డి పీకుడు భాష ప్రారంభించారన్నారు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ భాష వాడటం భావ్యం కాదన్నారు. తన బలహీనతలను కప్పిపుచ్చుకోడానికే పీకుడు భాష ప్రారంభించినట్లు కనిపిస్తోందని పయ్యావుల తెలిపారు. మీ భాషలోనే మాట్లాడాలంటే గత 3ఏళ్లలో నువ్వేం పీకావు..? రాయలసీమ ప్రాజెక్టుల్లో ఏం పీకావు..? ఉత్తరాంధ ప్రాజెక్టుల్లో ఏం పీకావు..? పోలవరం ప్రాజెక్టుల్లో ఏం పీకావు..?
అమరావతిలో ఏం పీకావు..? అని పయ్యావుల ప్రశ్నించారు. నువ్వు ఏం పీకావో చెప్పాలంటే పది పుస్తకాలు చాలవు..ప్రజావేదికను పీకావు.. ప్రజల సంతోషాన్ని, వెలుగులను పీకావు. యువకుల ఉద్యోగాలను పీకావు.. 24గంటల కరెంటును పీకేశావు, పరిశ్రమలను పీకేశావు..రాష్ట్రంలో అభివృద్దిని పీకేశావు..ప్రజల జీవితాలనే పీకేశావు.
ప్రత్యేక హోదా మీద ఏం పీకారు ఈ మూడేళ్లు..? మీరు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు..? ఢిల్లీ వెళ్తోంది పీకడానికా, పీకించుకోడానికా..? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పిపిఏలో అవినీతి గోల అన్నారు.. ఏం పీకారు..? అమారవతిలో అవినీతి అన్నారు, ఏం పీకారు..మూడేళ్లయ్యింది.. కోడికత్తి కేసు ఏం పీకారు..? బాబాయి హత్యలో ఏం పీకారు..?అని పయ్యావుల ప్రశ్నించారు. తానెప్పుడూ ఈ భాష వాడటానికి ఇష్టపడనని, కానీ ముఖ్యమంత్రి వాడారు కాబట్టి, ఆ భాషను అందరూ తిరిగి వాడితే ఎట్లుంటుంది చెప్పడానికే ఈ పీకుడు భాష వాడాల్సివస్తోందన్నారు. సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ మీద ఏం పీకారు..? మీరు పీకింది ఏందయ్యా అంటే రైతులకు డ్రిప్ మీద ఇచ్చే సబ్సిడీ పీకారు. ఇన్ పుట్ సబ్సిడీ పీకారు..ఇన్సూరెన్స్ పీకారు..ఎరువులు, విత్తనాల ధరలు పెంచి రైతు జీవితాలను పీకారు. ట్రాక్టర్లు, పనిముట్లపై సబ్సిడీలు పీకారు.. మీరు పీకిన జాబితా చాంతాడంత ఉందన్నారు. రోడ్లపై గుంతలు ఉంటే ఏం పీకావు..? ఒక్క రోడ్డు వేశాను రాష్ట్ర నిధులతో అని చెప్పుకోగలరా..? హంద్రీనీవా ప్రాజెక్టులో మీరేం పీకారు... గాలేరు నగరిలో ఏం పీకారు..? అని పయ్యావుల ప్రశ్నించారు.

భాష మార్చుకోండి ముఖ్యమంత్రిగారూ.. లేకుంటే ప్రజలు మిమ్మల్ని పీకేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. ఎలా పీకాలో ఎప్పుడు పీకాలో కూడా అందరూ డిసైడ్ అయి ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని పీకేయడానికి.. అంటూ పయ్యావుల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అసలు ముఖ్యమంత్రిగారిని ఒకటి అడగదల్చుకున్నా..మీరు పీకుడు గురించి మాట్లాడుతున్నారు..అసలు మీకు పీకేను పీకే దమ్ముందా..? పీకేను పీకేసి నువ్వు పనిచేయగలవా..? రేపేదో మంత్రివర్గ విస్తరణ పెట్టుకున్నారు, రాయలసీమలో ఎంతమంది మంత్రులను పీకుతావో చూస్తాం మేము..నూటికి నూరుశాతం పీకుతానని గతంలో చెప్పావు కదా, చూద్దాం..నువ్వెంతమందిని పీకుతావో 2రోజుల్లో తెలుస్తుంది కదా..అని అన్నారు. సొంత కేబినెట్ లో ఏం పీకలేనివాడివి ఇక ప్రతిపక్షాలనో, ఇంకెవరినో ఏం పీకుతావు..? అంటూ రెచ్చిపోయారు.

మీమీద విమర్శలు చేసే నాయకులను, మీమీద సద్విమర్శలు రాసే పత్రికలను పీకుడు భాషలో తిట్టడం సరికాదు.
ఇదే మీడియా ఆరోజు చంద్రబాబు ను మోస్తున్నాయని కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేశావు కదా.. మరి అధికారంలోకి నువ్వెట్లా వచ్చావు..? మీడియా సమస్యలను హైలెట్ చేస్తుంది, ప్రతిపక్షం ప్రజల తరఫున ప్రశ్నిస్తుంది. వాటిపై తిట్లదండకాలతో దాడిచేస్తే, నిన్ను ప్రజలు శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు, జాగ్రత్త..
నిన్నటిదాకా తాడేపల్లినుచి బైటకు రాలేదు. మొదటిసారి ప్రజల్లోకి పోతున్నాడు కాబట్టి ప్రజల్లో అటెన్సన్ కోసమే ఈ భాష మాట్లాడారు..తన బలహీనతను అధిగమించడానికి, లేని గొప్పదనాన్ని చూపించుకోడానికి, దిగజారిపోతున్న తన ప్రతిష్టను కాపాడుకోలేకే ఇట్లాంటి భాష ఉపయోగిస్తున్నాడంటూ పయ్యావుల వ్యాఖ్యానించారు.

English summary
tdp mla payyavula keshav on today strongly objected on cm ys jagan's plucking comments on opposition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X