బీజేపీతో అడుగంటిన పొత్తు ఆశలు: రూటుమార్చిన టీడీపీ: అమిత్ షా చెబితే గానీ: జగన్ నెట్‌వర్క్‌

అమరావతి: ప్రతిపక్ష తెలుగుదేశం తొలిసారిగా భారతీయ జనతా పార్టీపై బాహటంగా ఘాటు విమర్శలను సంధించింది. బీజేపీతో పొత్తు కుదుర్చుకునే ఆశలు దాదాపు అడుగంటిన వేళ.. ఇక లాభం లేదనుకుంది. కమలంపైనా ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడం మొదలు పెట్టింది. విమర్శనాస్త్రాలను సంధించడాన్ని ఆరంభించింది. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్వయంగా బీజేపీ జాతీయ స్థాయి పెద్దల అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా.. ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఆ అక్కసును వెలిబుచ్చడం ప్రారంభించింది.

బీజేపీని టార్గెట్ చేసిన టీడీపీ..

బీజేపీని టార్గెట్ చేసిన టీడీపీ..

ఎప్పుడూ లేనివిధంగా తొలిసారిగా తెలుగుదేశం పార్టీ.. బీజేపీని లక్ష్యంగా చేసుకుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ-బీజేపీని కలిపి ఉతికి ఆరేసింది. టీడీపీ శాసన సభ్యుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఏపీ బీజేపీ నాయకుల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘాటు విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం ఆర్థిక అరాచకాలకు పాల్పడుతోందని, అయినప్పటికీ.. ఏపీ బీజేపీ నాయకులు నోరెత్తకుండా మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు.

వైఎస్ జగన్ నెట్‌వర్క్‌లో..

వైఎస్ జగన్ నెట్‌వర్క్‌లో..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెట్‌వర్క్‌లో బీజేపీ నాయకులు చిక్కుకుని విలవిల్లాడుతున్నారని ఆరోపించారు. తమ పార్టీ సొంత అజెండా అయిన హిందుత్వాన్ని కూడా కమలనాథులు పణంగా పెట్టారని మండిపడ్డారు. హిందుత్వాన్ని జగన్ సర్కార్ ధ్వంసం చేస్తోన్నా బీజేపీ నేతలు నోరు మెదపట్లేదని అన్నారు. యథేచ్ఛగా ఆలయాలపై దాడులు జరుగుతున్నా ఏపీ బీజేపీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన విమర్శించారు.

అమిత్ షా చెబితే గానీ తెలియదా?

అమిత్ షా చెబితే గానీ తెలియదా?

సుదీర్ఘకాలం పాటు సాగుతూ వస్తోన్న అమరావతి ప్రాంత రైతుల నిరసనలు, ఆందోళనలకు మద్దతు ఇవ్వాలనే కనీస జ్ఞానం కూడా బీజేపీ నాయకులకు లేకుండా పోయిందని అన్నారు. ఈ విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనలు చేసేంత వరకూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని అన్నారు. అమరావతి రైతులకు మద్దతు ఇవ్వాలని అమిత్ షా ఆదేశించిన తరువాతే వారిలో చలనం వచ్చిందని పయ్యావుల చురకలు అంటించారు.

జగన్ కోసం పని చేస్తోన్న బీజేపీ..

జగన్ కోసం పని చేస్తోన్న బీజేపీ..

ఏపీ బీజేపీ ప్రజల కోసం పని చేయట్లేదని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటోన్న వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వం కోసం పని చేస్తోన్నారని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. బీజేపీ కాస్తా భారతీయ జగన్ పార్టీలా మారిందని అన్నారు. వైఎస్ జగన్ కనుసన్నల్లో, ఆయన నెట్‌వర్క్‌లో ఏపీ బీజేపీ పని చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ విజయవాడలో నిర్వహిస్తోన్నది ప్రజా ఆగ్రహసభ కాదని, జగన్ అనుగ్రహ సభ అని ఎద్దేవా చేశారు. జగన్ అనుగ్రహ సభగా పేరు మార్చుకోవాలని పయ్యావుల కేశవ్ సూచించారు.

ప్రభుత్వ అరాచకాలపై పోరాడగలరా?

ప్రభుత్వ అరాచకాలపై పోరాడగలరా?

ఏపీ బీజేపీ నేతలకు రాష్ట్రం పట్ల నిజంగా చిత్తశుద్ధి, ప్రజల పట్ల ప్రేమ ఉంటే ప్రభుత్వ అరాచకాలపై పోరాడాలని సూచించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేసినా రాష్ట్ర బీజేపీ ఎందుకు స్పందించలేదని పయ్యావుల కేశవ్ నిలదీశారు. కేంద్రం పంపించే వేల కోట్ల రూపాయల నిధులను జగన్ సర్కార్ పక్కదారి పట్టిస్తున్నారని, ఆ నిధులను మళ్లిస్తున్నారని మండిపడ్డారు. ఇంతా జరుగుతున్నప్పటికీ ఏపీ బీజేపీ నేతలు దాని గురించి మాట్లాడట్లేదని విమర్శించారు.

ఆర్థిక అరాచకాలపై మౌనం ఎందుకు?

ఆర్థిక అరాచకాలపై మౌనం ఎందుకు?

జగన్ ఆర్థిక అరాచకాలపై మౌనంగా ఉంటున్నారని పయ్యావుల కేశవ్ అసహనం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వ అరాచకాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో ఏపీ బీజేపీ నేతలు ఘోరంగా విఫలం అయ్యారని విమర్శించారు. దేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌ షా నెట్‌వర్క్‌లో ఉంటే, ఏపీలో బీజేపీ నేతలు మాత్రంలో జగన్‌ నెట్‌వర్క్‌లో పని చేస్తోన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏం జరిగినా అది తమకు సంబధం లేని అంశంపై బీజేపీ నాయకులు మౌనంగా ఉంటున్నారని ఆయన అన్నారు.

కేంద్ర సంస్థలో విచారణ..

కేంద్ర సంస్థలో విచారణ..

రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, శాంతిభద్రతలు అదుపు తప్పాయని పయ్యావుల ఆరోపించారు. అదే పశ్చిమ బెంగాల్‌లో చీమ కుడితే కేంద్ర బృందాలను దించుతారని, ఏపీలో అరాచకం కొనసాగుతున్నా బీజేపీ నాయకులు అసలు మాట్లాడట్లేదని, ఎవరితో లాలూచీ పడ్డారని పయ్యావుల ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడులపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+