గుంటూరు ఎస్పీ ఆఫీసుకు రఘురామ-వారి సస్పెన్షన్ కు పట్టు !

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ బాధితుడైన ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తనకు ఎదురైన అవమానాన్ని అంత త్వరగా మర్చిపోయేలా కనిపించడం లేదు. గతంలో విద్వేష వ్యాఖ్యల కేసులో తనను అరెస్టు చేసి కస్టడీలో హింసించిన అధికారులపై చర్యలకు ఆయన పట్టుబడుతున్నారు. ఇదే డిమాండ్ తో తాజాగా అప్పటి సీఎం వైఎస్ జగన్ తో పాటు మాజీ సీఐడీ బాస్ పీవీ సునీల్ కుమార్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిపై ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు కోరుతూ ఇవాళ గుంటూరు ఎస్పీ కార్యాలయానికి రఘురామ వెళ్లారు.

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు.. అధికారుల్ని కలిసి తన ఫిర్యాదుపై నమోదైన సీఐడీ కేసుపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు సీఐడీ కార్యాలయంలో
తనను చంపేందుకు కుట్రపన్నారని, మీడియా వల్లనే తాను బతికిపోయినట్లు వెల్లడించారు. తన ఫిర్యాదు మేరకు మాజీ సీఐడీ డిజి సునీల్ కుమార్, విజయ్ పాల్, మాజీ సీఎం జగన్, జిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి మీద కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు, పురోగతి తెలుసుకోవటానికి వచ్చానన్నారు.

tdp mla raghurama Krishnam raju visit Guntur sp office to pressure suspension of cid officials

తన దగ్గర ఉన్న సమాచారం పోలీసు అధికారులకు ఇచ్చేందుకు వచ్చినట్లు రఘురామ తెలిపారు. కేసు నమోదైంది కాబట్టి సిఐడి అధికారులును సస్పెండ్ చేయాలన్నారు. అధికారులు బయటకు వెళ్ల గానే ఐదుగురు వచ్చి కొట్టారన్నారు. తనను చిత్ర హింసలకు గురి చేసి ఏమీ తెలియనట్లు నటించారన్నారు. అప్పటి కలెక్టర్ తీసుకున్న చర్యలు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+