RRR: ఆయన బయట ఉంటే నాకే ప్రమాదం, చంద్రబాబుకు ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం మాజీ ఛీఫ్ పీవీ సునీల్ కుమార్ తన కేసులోని సాక్షులను బెదిరిస్తున్నారని, ఆయన్ను కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాలని ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఓ తప్పుడు కేసులో తనను కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేశారని, తాను పెట్టిన కేసులో నిందితుడైన పీవీ సునీల్ కుమార్ ఇప్పుడు సాక్షులను బెదిరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఆరోపిస్తున్నారు.
తన కేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే మీ అంతు చూస్తానని సాక్షులను పీవీ సునీల్ కుమార్ బెదిరిస్తున్నారని, ఆయన బయట ఉంటే తనకు ఏ మాత్రం న్యాయం జరగదని ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను అదే పార్టీ ఎంపీ అనే విషయం కూడా మర్చిపోయి తనను అరెస్టు చేసి పోలీస్ కస్టడీలో పెట్టి టార్చర్ పెట్టారని, తనను ఇష్టం వచ్చినట్లు కొట్టారని వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు జూలై 11వ తేదీన పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.

ఆనాటి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్, విజయ్ పాల్, పీఎస్ఆర్ ఆంజనేయులు, డాక్టర్ ప్రభావతితో పాటు కొందరిపై టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పట్టాభిపురం పోలీసులు ఈ కేసులో ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు. ఈ కేసులో రఘురామ కృష్ణరాజుతో పాటు కొందరు సాక్షులను విచారణ చేసి వారి నుండి ఆధారాలు సేకరించారు. ఈ కేసులో పోలీస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు బెల్ తీసుకున్నారు. ఇద్దరు పోలీసు అధికారులను చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఇదే కేసులో పోలీసు అధికారి విజయ్ పాల్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. విజయ్ పాల్ కోసం పట్టాభిపురం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ కేసులో మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చబితే మీ అంతు చూస్తానని పోలీసు అధికారి సునీల్ కుమార్ సాక్ష్యులను బెదిరిస్తున్నారని, ఆయన్ను కస్టడీలోకి తీసుకొని తనకు న్యాయం చేయాలని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు సీఎం చంద్రబాబు నాయుడుకు మనవి చేశారు. ఈ కేసులో అవసరమైతే తాను మరోసారి కోర్టును ఆశ్రయిస్తామని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు అంటున్నారు.












Click it and Unblock the Notifications