వైయస్ జగన్ పార్లమెంట్‌లో పిల్లి: టీడీపీ ఎమ్మెల్యే, చంద్రబాబుకు భయం: అప్పిరెడ్డి
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌పై మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీగా ఉన్నన్ని రోజులు పార్లమెంట్‌లో పిల్లిలా ఉన్న వైయస్ జగన్, బయట మాత్రం పులిలా బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సమయంలో పార్లమెంట్‌లో కడప పౌరుషం ఏమైందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ ధర్నాలు, నిరసనలు చేపట్టే నైతిక హక్కు వైయస్ జగన్‌కు లేదన్నారు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ బీజేపీతో పొత్తు ఉండటం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు రూ. 3వేల కోట్లు తీసుకువచ్చామన్నారు.
ఏపీ రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయాలో సీఎం చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసని, ఎవరూ సలహా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. గుంటూరులో జగన్ తలపెట్టిన దీక్షను అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే జగన్ ప్రాథమిక లక్ష్యాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ నేతలకు అనుకూలంగా పోలీసులు
పోలీసులు టీడీపీ నాయకుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడం సరైంది కాదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైయస్ జగన్ తలపెట్టిన ప్రజా ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే సహించేది లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తే భావితరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా వస్తే వైయస్ జగన్‌కు పేరొస్తుందేమోనని సీఎం చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ దీక్షకు అనుమతి లేదంటూ ఢిల్లీలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు.












Click it and Unblock the Notifications