వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రంలో జగనన్న విద్యుత్ కోతల పథకం: టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సెటైర్లు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలపై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. తాజాగా కరెంట్ కోతలపై టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి, అసమర్థత వల్లే రాష్ట్రంలో అంధకారం నెలకొందని ఏలూరి సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జె టాక్స్ తో కళకళలాడుతుంటే,కరెంట్ కోతలతో ఏపీ ప్రజలు మగ్గిపోతున్నారు అని టిడిపి ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

ఏపీలో విద్యుత్ కోతలు: అసమర్ద సీఎం జగన్ వల్లే.. టీడీపీ ఫైర్, రైతుల ఆందోళనఏపీలో విద్యుత్ కోతలు: అసమర్ద సీఎం జగన్ వల్లే.. టీడీపీ ఫైర్, రైతుల ఆందోళన

 గ్రామాలలో జగనన్న విద్యుత్ కోతల పథకం

గ్రామాలలో జగనన్న విద్యుత్ కోతల పథకం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి కొత్త పథకాన్ని తీసుకు వచ్చాడని, గ్రామాలలో జగనన్న విద్యుత్ కోతల పథకం అమలవుతుంది అంటూ ఏలూరి సాంబశివరావు జగన్ సర్కార్ ను ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరెంటు కోసం ఎదురుచూపులు తప్పడం లేదని ఆయన మండిపడ్డారు. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు అన్ని గ్రామాలలో అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయి అని ఏలూరి సాంబశివరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

కమీషన్లకు కక్కుర్తి కోసం వ్యవస్థలను నాశనం చేసిన జగన్

కమీషన్లకు కక్కుర్తి కోసం వ్యవస్థలను నాశనం చేసిన జగన్


జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా అయిన తరువాత ప్రజలకు నష్టం చేసే అనేక పథకాలను తీసుకువచ్చారని, అందులో జగనన్న విద్యుత్తు కోతల పథకం కూడా ఒకటి అని సెటైర్లు వేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సమర్థవంతంగా పరిపాలన చేయలేకపోతున్నారని, కమీషన్లకు కక్కుర్తి కోసం వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఏలూరి సాంబశివరావు మండిపడ్డారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడి నీరు సమృద్ధిగా ఉందని, బొగ్గు కొరత కూడా ఎక్కడా లేదని అయినప్పటికీ విద్యుత్ కోతలు దేనికోసమో చెప్పాలని జగన్ ను ప్రశ్నించారు.జగన్ చేతగానితనంతో విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చారని మండిపడ్డారు.

 చంద్రబాబు హయాంలో కరెంట్ కోతలు లేవు

చంద్రబాబు హయాంలో కరెంట్ కోతలు లేవు

రాష్ట్రంలో ప్రస్తుతం కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తరువాత 22 మిలియన్ యూనిట్లు లోటు ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు తన అనుభవంతో సర్ ప్లస్ చేసి ప్రతి ఇంటికి 24 గంటల కరెంటు అందించారని నాటి చంద్రబాబు హయాంలో కరెంటు సమస్య లేదని స్పష్టం చేశారు ఏలూరి సాంబశివరావు. 9529 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం నుంచి 19,080 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో 24 గంటలు విద్యుత్ అందిస్తే, జగన్ హయాంలో రోజుకు మూడు గంటలు కూడా విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదని, ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో ఇంకా ఇంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు.

 రైతులకు కరెంట్ కోతలతో ఆందోళన

రైతులకు కరెంట్ కోతలతో ఆందోళన

విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై ఆరు సార్లు 30 వేల కోట్ల భారం వేశారని, అయినప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఏంటని ప్రశ్నించారు. రైతులకు పంట చేతికి వచ్చే సమయానికి విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉందని, రైతులు ఆందోళన చెందుతున్నారని ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. రైతులకు కనీసం ఇస్తానన్న 9 గంటల కరెంటు కూడా సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టి వేల కోట్ల భారం వేస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. జగన్ అసమర్ధతతో, చేతివాటంతో విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టించారు అని ఏలూరి సాంబశివరావు విమర్శలు గుప్పించారు.

జగన్ బాధ్యతారాహిత్యానికి కరెంటు కోతలు నిదర్శనం

జగన్ బాధ్యతారాహిత్యానికి కరెంటు కోతలు నిదర్శనం

జగన్ బాధ్యతారాహిత్యానికి కరెంటు కోతలు నిదర్శనమని పేర్కొన్న ఏలూరి సాంబశివరావు సమర్ధుడు చంద్రబాబు సర్ ప్లస్ పవర్ క్రియేట్ చేస్తే, అసమర్థుడైన జగన్ పవర్ షార్టేజ్ కు తీసుకువెళ్లారు అంటూ మండిపడ్డారు. డిస్కమ్‌ల పేరుతో రూ.6వేల కోట్లకుపైగా అప్పులు తెచ్చి వాటిని దారి మళ్లించారని,కమీషన్లకు కక్కుర్తి కోసం వ్యవస్థలను నాశనం చేశారని ఏలూరి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇప్పటికైనా కళ్లు తెరవాలని, అవినీతిని పక్కనపెట్టి విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాలని ఏలూరి సాంబశివరావు డిమాండ్ చేశారు.

Recommended Video

Manthani MLA Sridhar Babu Disbelief On Telangana Police | Oneindia Telugu

జగన్ రెడ్డి రివర్స్ పాలనలో విద్యుత్ రంగానికి తీరని నష్టం

టిడిపి హయాంలో ఐదు సంవత్సరాల్లో ఏనాడు విద్యుత్ చార్జీలు పెంచలేదని, భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, కానీ జగన్ రెడ్డి మోహన్ రెడ్డి హయాంలో ఇప్పటికే నగరాల్లో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు బిగించేందుకు కరెంట్ బిల్లులు వసూలు చేసే స్థాయికి దిగజారారని మండిపడ్డారు. జగన్ అసమర్థత పాలన వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు కూడా రాకుండా పోయాయని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని దారుణమైన పరిస్థితులు రాబోతున్నాయో అని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి రివర్స్ పాలనలో విద్యుత్ రంగానికి జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదని టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు.

English summary
TDP MLA yeluri Sambasiva rao has said that the Jagananna power cut scheme will be implemented in the state. TDP MLA slams jagan in the wake of two days of unannounced power cuts in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X