AP Assembly: టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాకౌట్ ! గవర్నర్ ప్రసంగంపై ఫైర్..
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే అసెంబ్లీ, మండలి ఉమ్మడి సెషన్ నిర్వహించారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే రచ్చ మొదలైంది. గవర్నర్ ప్రసంగంలో అంశాల్ని తప్పుబడుతూ టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
గవర్నర్ ప్రసంగంలో అంతా అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభం అయినప్పటి నుంచి సీట్లలో నే కూర్చుని నినాదాలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీలెక్కడ అంటూ సభలో నిలబడి ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీ లు సభ నుంచి వాకౌట్ చేసి బయటికి వెళ్లిపోయారు. అనంతరం గవర్నర్ ప్రసంగం కొనసాగింది.

గవర్నర్ ప్రసంగం పై నిరసన తెలుపుతూ వాకౌట్ చేసిన టీడీపీ..!!#TDP #ApAssemblySessions #ApAssembly #Oneindiatelugu pic.twitter.com/l47N5421ui
— oneindiatelugu (@oneindiatelugu) February 5, 2024
గవర్నర్ ప్రసంగం పూర్తి చేసిన తర్వాత అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఎన్ని రోజులు సభ నిర్వహించాలి, ఇందులో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాలి, ఇతర అంశాలపై చర్చించేందుకు బీఏసీ కాసేపట్లో సమావేశమవుతోంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రేపు మాత్రం గవర్నర్ ప్రసంగంపై చర్చ చేపడతారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తారు.












Click it and Unblock the Notifications