ఎమ్మెల్సీ పోలింగ్ వేళ బాంబుపేల్చిన టీడీపీ- 16 వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ..

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ భయాలు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరూ క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం ఖాయంగా కనిపిస్తోంది.

అమరావతి : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. అమరావతిలోని వెలగపూడి అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సీఎం జగన్ తొలి ఓటు వేసి పోలింగ్ ప్రారంభించగా.. మిగతా ఎమ్మెల్యేలు వరుసగా ఓటు వేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ ఇరు పార్టీల నుంచీ క్రాస్ ఓటింగ్ తప్పేలా లేదు.

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ భయాల మధ్యే ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే వైసీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నట్లు టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. సీఎం జగన్ పై అసంతృప్తిగా ఉన్న మూడు ప్రాంతాలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తమకు ఓటు వేయడం ఖాయమని వారు చెప్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.

tdp mlas nimmala and gorantla says 16 ysrcp mlas in touch with them amid mlc polls voting contitues

వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు నిన్న రాత్రి విజయవాడలో ఏర్పాటు చేసిన క్యాంపు హోటల్ నుంచి వెళ్లిపోవడం, ఉదయం ఫోన్లో కూడా టచ్ లోకి రాకపోవడం వంటి కారణాలతో ఉత్కంఠ పెరుగుతోంది. అయితే వారు అసెంబ్లీకి చేరుకోవడం ఖాయమని వైసీపీ నేతలు చెప్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల్లోపు ఓట్లు వేసే ప్రతీ ఎమ్మెల్యేపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లికి రప్పించే బాధ్యతను మంత్రులు పర్యవేక్షిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+