వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనరల్ ప్రావిడెంట్ ఫండా- జగన్ ప్రావిడెంట్ ఫండా ? ఉద్యోగుల ఖాతాల్లో డబ్బు మాయంపై అశోక్ బాబు

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో నుంచి ఆరునెలలుగా వారికి ఇచ్చిన రూ.800 కోట్లను ప్రభుత్వం వెనక్కితీసుకోవడాన్ని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తీవ్రంగా తప్పుబట్టారు. జీపీఎఫ్ ఖాతాల్లో డబ్బులు తీసుకోవడం సరికాదని ఆయన ఆక్షేపించారు. ఏ రాష్ట్రంలో జరగని ఎకనామిక్ డిజార్డర్స్, ఫైనాన్షియల్ డిసార్టర్స్ ఏపీలో జరుగుతున్నాయని ఆయన విమర్శించారుఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ పిల్లల ఉన్నత చదువులు, పెళ్లీళ్లు, వైద్యం, అవసరాలకు ఏర్పాటు చేసుకునే జీపీఎఫ్ సొమ్మును అధికారులు మాయం చేశారని, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ని జగన్ ప్రావిడెంట్ ఫండ్ గా మార్చారని సంచలన ఆరోపణలు చేశారు.

2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగస్థుల జీపీఎఫ్ అకౌంట్ లో డీఏ బకాయిలు పడితే వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకుందని అశోక్ బాబు ఆరోపించారు. దాన్ని 2021-22 ఏప్రిల్ నెలలో మళ్లీ జీపీఎఫ్ అకౌంట్లలోకి క్రియేట్ చేశారన్నారు. ఉద్యోగులకు ఇచ్చే డీఏ బకాయిల మొత్తం ఉద్యోగస్థులకు ఇచ్చేసినట్లు డెబిట్ చూపారన్నారు.. మార్చిలో తిరిగి చెల్లించినట్లుగా జీపీఎస్ అరియర్స్ లో చూపారన్నారు. జీపీఎఫ్ అకౌంట్ లోకి వెళ్లాలంటే సీఎఫ్ఎంఎస్ లో క్లియర్ అయి ఎంప్లాయిస్ ఖాతాకి జీపీఎఫ్ అకౌంట్ లో జమ అవుతుందని, జమ అయిన అకౌంటు మళ్లీ డ్రా చేసే అధికారం ఎంప్లాయికే తప్ప ప్రభుత్వానికి లేదన్నారు.

tdp mlc ashok babu ask whether it is general provident fund or jagan provident fund ?

జీపీఎఫ్ అకౌంట్ డబ్బులంటే బ్యాంకులో భద్రంగా దాచుకున్న డబ్బులాంటిదే. దీనికి ఏజీ ఇంట్రస్ కూడా చెల్లిస్తారని అశోక్ బాబు తెలిపారు. డీఏ బకాయిలూ ప్రభుత్వం క్యాష్ ఇవ్వలేకపోతే బుక్ అడ్జ్ స్ట్ మెంట్ కింద ఏజీకి ఇచ్చి జీపీఎఫ్ అకౌంటును క్రియేట్ చేస్తారని పేర్కొన్నారు. 2018 నుంచి ఇవ్వాల్సిన డిఏ అరియర్స్ మొత్తం క్యాష్ ఇస్తానన్న జగన్ ప్రభుత్వం క్యాష్ ఇవ్వకుండా జీపీఎఫ్ అకౌంటుకు క్రియేట్ చేశారని విమర్శించారు. అది ఉద్యోగులకు ఉపయోగపడకుండా 2022 మార్చిలో మళ్లీ వారికే చెల్లించినట్లు చూపారన్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు గతంలోనే ఫిర్యాదు చేసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. మా అమౌంటు 18వందల కోట్లు ప్రభుత్వం తీసుకొందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయని, జులై 2018, జనవరి 2019 డీఏ బకాయిలను ప్రభుత్వం గత యేడాది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమచేసి తేదీ మారకముందే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారని అశోక్ బాబు ఆరోపించారు. వేసి మళ్లీ తీసుకోవాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వం వాడుకుందా లేక ఇతర కారణాలున్నాయా అనేది తేలాలన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో మున్సిపాలిటీకి డబ్బులొస్తే ప్రభుత్వం వాడుకోవడం చాలా అన్యాయం అన్నారు.

జీపీఎస్ అనేది దాదాపు బ్యాంకఅకౌంటు లాంటిదని, ఉద్యోగస్థులకు చెందిన డబ్బు మాత్రమే అందులో ఉంటుందని అశోక్ బాబు తెలిపారు.ప్రభుత్వం డబ్బు అందులో ఉండదన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ పిల్లల ఉన్నత చదువులు, పెళ్లీళ్లు, వైద్యం, అవసరాలకు ఏర్పాటు చేసుకునే జీపీఎఫ్ సొమ్మును మాయం చేశారు. 6,800 కోట్లు డీఏ అరియర్స్ ఉందన్నారు. రిటైర్ మెంట్ డబ్బులు 2,200 కోట్లు ఉద్యోగస్థులకు ఇవ్వాల్సి ఉందని, దీన్ని మార్చి లోపు ఇచ్చేస్తామని డిసెంబర్ లో జరిగిన అగ్రిమెంట్ లో చెప్పారు. ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం చెప్పిన ఆరు నెలలకు కూడా రిటైర్ మెంట్ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. జీపీఎఫ్ లో డబ్బులు ఉన్నాయనుకుంటే ఆ డబ్బు డ్రా చేయడానికి వీలులేదని, మనం వేసుకున్న లెక్కలు వేరు, జీపీఎఫ్ స్లిప్పులు వేరుగా ఉంటున్నాయని అశోక్ బాబు విమర్శించారు.

ప్రభుత్వం బడ్జెటింగ్ లో, పబ్లిక్ కి ఫిగర్స్ చూపించడంలో తప్పులు చూపిస్తోందని, జీపీఎఫ్ మొత్తం మేమే వాడుకున్నాం, త్వరలో ఇస్తామని ప్రభుత్వం చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదన్నారు. అప్పులు తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రము ఇలా చేసి ఉండదు. అప్పు తెచ్చుకోవడానికి ప్రభుత్వానికి అప్పు తక్కువగా ఉందని చూపించే విధానంలో ఈ మొత్తం ఉద్యోగస్థులకు చెల్లించేశామని దొంగ లెక్కలు చూపించారేమో అని అనుమానం కలుగుతోందన్నారు.. ఉద్యోగస్థుల జీపీఎఫ్ పట్టుకునే పరిస్థితి లేదని. దాన్ని డ్రా చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. అందులో క్రెడిట్ అవ్వాలంటే సీఎఫ్ఎంఎస్ లో పాస్ అయిన తరువాత క్రెడిట్ అవుతుందన్నారు. సీఎఫ్ఎంఎస్ లో పాస్ అవడమంటే అధికారపరంగా ప్రభుత్వం జీవో ఇచ్చి దానికి బిల్స్ వేసి ఓ ప్రాసెస్ అయిన తరువాత మాత్రమే జీపీఎఫ్ కు వెళ్తుందన్నారు. అలా వెళ్లిన అమౌంట్ ని వెనక్కి తీసుకురావడమనేది ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదన్నారు.ఇది ఏపీలో మాత్రమే జరుగుతోందన్నారు.

రిటైర్డ్ అయిన ఎంప్లాయిస్ కి ఇంతవరకు బకాయిలు చెల్లించలేదని అశోక్ బాబు తెలిపారు. కంపార్స్మెంట్ అపాయింట్ మెంట్ లు క్లియర్ చేయలేదు. చాలమంది ఎంప్లాయిస్ కి రెగ్యులర్ గా జీతాలు ఇవ్వడంలేదు. ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ కి 60 శాతం మాత్రమే 1వ తేదీన జీతాలిస్తున్నారు. మిగతా 40 శాతం అంచలంచలుగా ఇస్తున్నారు. ఉద్యోగస్థులు దాచుకున్న సేవింగ్స్ తో ప్రభుత్వం ఆట్లాడుకోవటం, ఫైనాన్షియల్ గా తప్పుడు ఫిగర్స్ చూపించడం, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవటం అన్యాయం. ఉద్యోగస్థుల కష్టార్జితమైన డీఏ అర్రియర్స్ రూ.800 కోట్లు వెనక్కి తీసుకోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఉద్యోగ సంఘాలు కూడా దీనిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్సీ పర్చూరు అశోక్ బాబు డిమాండ్ చేశారు.

English summary
tdp mlc ashok babu ask ruling ysrcp govt that the amount withdrawn is whether general provident fund or jagan provident fund ?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X