ఏపీలో కరోనా విలయం: విషమంగా టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోగ్యం -రెండోసారి కరోనా సోకడంతో

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుతోందని భావించినా, సెకండ్ వేవ్ భయాలు అందరిలో గుబులు పెంచుతోంది. ఇప్పటికే కరోనా బారినపడి ఏపీలో ఏడు వేల మంది ప్రాణాలు కోల్పోగా, అందులో ప్రముఖ రాజకీయ నేతలు కూడా ఉన్నారు. తాజాగా రెండోసారి కరోనా కాటుకు గురైన టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.

టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కొద్ది రోజుల కిందటే కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ ఆయనకు రెండోసారి కూడా వైరస్ సోకింది. దీంతో ఆయన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతోన్న క్రమంలో గురువారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఆయన శ్వాస(ఊపిరి) తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో..

TDP MLC Bachula Arjunudu health in critical, tested covid-19 positive for second time

మెరుగైన వైద్యం కోసం బచ్చులను విజయవాడ నుంచి హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అర్జునుడు ఆరోగ్యంపై ఆరా తీసిన టీడీపీ అధినేత చంద్రబాబే తరలిపు కోసం శ్రేణుల్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. బచ్చుల ఆరోగ్యం విషమించిందనే వార్తలతో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

ఏపీలో సాధారణ జనంతోపాటు రాజకీయ నేతలు సైతం పెద్ద సంఖ్యలో కరోనా బారినపడ్డారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మహమ్మారికి బలైపోయారు. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కొవిడ్ పాజిటివ్ గా తేలడంతో ఆయన సహా, ఆయన్ను కలిసిన నేతలందరూ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

ఏపీ ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 664 కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,70,076కు, 7014కు పెరిగింది. ఏపీలో కోరోనా బారినపడ్డవాళ్లలో ఇప్పటికే 856320 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6742గా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+