వైఎస్ వివేకాను హత్య చేసిందెవరో జగన్ కు తెలుసు .. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలనం

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి విచారించిన సిబిఐ అధికారులు, తాజాగా ఈ కేసులో మరో పురోగతి సాధించిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ ను సిబిఐ అధికారులు గోవాలో అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని సీబీఐ అధికారికంగా కూడా ధ్రువీకరించింది. ఇదిలా ఉంటే వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న సమయంలో టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు.

వివేకాను హతమార్చింది ఎవరో జగన్ కు తెలుసు : బీటెక్ రవి

వివేకాను హతమార్చింది ఎవరో జగన్ కు తెలుసు : బీటెక్ రవి

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా తెలుసని టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. పులివెందుల మీడియాతో మాట్లాడిన ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసు పై స్పందించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో పలు అనుమానాలు ఉన్నాయని బీటెక్ రవి, సీఎం జగన్ నిందితులను తప్పించడానికి ప్రణాళికలు వేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్ వీరంతా నిందితులు అయితే కీలక సాక్షి అయిన రంగన్న నేరుగా వైయస్ జగన్ కు చెబితే కేసు వెంటనే అయిపోతుంది కదా అంటూ బీటెక్ రవి ప్రశ్నించారు.

నిందితులను కేసు నుండి తప్పించే కుట్ర జగన్ చేస్తున్నారు

నిందితులను కేసు నుండి తప్పించే కుట్ర జగన్ చేస్తున్నారు

ఈ మాత్రం దానికి రెండేళ్ల సమయం కావాలా అంటూ జగన్ ను నిలదీశారు. తన చిన్నాన్న హత్య కేసులో నిందితులు ఎవరో జగన్ కు తెలుసన్న బీటెక్ రవి వైయస్ కుటుంబం లో ఒక వ్యక్తిని హత్య చేసి పులివెందులలో అనిల్ యాదవ్ లాంటి సాధారణ వ్యక్తులు తిరిగే పరిస్థితి ఉందా అంటూ ప్రశ్నించారు. ఎర్ర గంగిరెడ్డి భయపెడితే భయపడే వాళ్ళు పులివెందులలో లేరని పేర్కొన్న బీటెక్ రవి వాచ్ మ్యాన్ రంగన్న ఎర్ర గంగిరెడ్డి తనను చంపేస్తానని బెదిరించాడని ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎస్పీ దీర్ఘకాలిక సెలవు, సీబీఐ అధికారి కేసు నుండి తప్పుకోవటంపై అనుమానాలు

ఎస్పీ దీర్ఘకాలిక సెలవు, సీబీఐ అధికారి కేసు నుండి తప్పుకోవటంపై అనుమానాలు


గతంలో కడప ఎస్పీ అభిషేక్ మహంతి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని, ప్రస్తుతం సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో సిబిఐ ఉన్నతాధికారి సుధా సింగ్ దర్యాప్తు నుంచి తప్పుకున్నారని ఈ రెండు అంశాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి అని బీటెక్ అని పేర్కొన్నారు. అసలు నిందితులను తప్పించడం కోసం, సీఎం జగన్ పకడ్బందీగా వ్యూహాలు రచిస్తున్నారని ఆయన జగన్ ను టార్గెట్ చేశారు. టీడీపీ నేతలు కూడా ఇప్పటికే అనేక సార్లు జగన్ వివేకా హత్య కేసుతో సంబంధం ఉందని ఆరోపించారు . జగన్ సర్కార్ హయాంలో ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసినా చెల్లెలికే న్యాయం చెయ్యలేకపోయారని టీడీపీ నేతలు ఆరోపించారు.

 నిందితుడు సునీల్ యాదవ్ పిటీషన్ లో బీటెక్ రవి పేరు

నిందితుడు సునీల్ యాదవ్ పిటీషన్ లో బీటెక్ రవి పేరు

ఇదిలా ఉంటే వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న సునీల్ యాదవ్ విచారణ పేరుతో సిబిఐ అధికారులు వేధిస్తున్నారని, వివేకానంద రెడ్డి హత్య కేసు ఒప్పుకోవాలని తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని ఏపీ హైకోర్టులో సునీల్ యాదవ్ పిటిషన్ వేశారు . అంతేకాదు వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డితో పాటుగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి లను కూడా సిబిఐ దర్యాప్తు చేయాలని తాను దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.

దూకుడు పెంచిన సీబీఐ .. 60 రోజులుగా నాన్ స్టాప్ విచారణ

దూకుడు పెంచిన సీబీఐ .. 60 రోజులుగా నాన్ స్టాప్ విచారణ

ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇక పులివెందుల నుండి పారిపోయి గోవాకు మకాం మార్చాడు. అతడిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఈ కేసులో కీలక పురోగతి సాధించినట్టు తెలుస్తుంది. ఇక ఇదే సమయంలోటీడీపీ నేత బీటెక్ రవి వైయస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారం జగన్ కు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులు దూకుడు పెంచారు. 60 రోజులుగా నిరాటంకంగా సిబిఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

 దేశ వ్యాప్తంగా వైఎస్ వివేకా హత్య కేసుపై ఉత్కంఠ

దేశ వ్యాప్తంగా వైఎస్ వివేకా హత్య కేసుపై ఉత్కంఠ

ఈ కేసును త్వరితగతిన తేల్చాలని సిబిఐ అధికారులు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. 2019 మార్చి 14వ తేదీన, గత ఎన్నికల సమయంలో వైయస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అప్పటినుండి ఇప్పటివరకు ఆయనను ఎవరు హతమార్చారు? ఎందుకు హతమార్చారు? హత్య వెనుక ఉన్న కారణాలేంటి ? వివేకానంద రెడ్డి హత్య రాజకీయ హత్యనా ? లేక వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్య అనేది ఇప్పటి వరకు తెలియలేదు. తాజాగా సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో వివేకానంద రెడ్డి హత్య కేసుపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+