వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘురామ లేఖకు సాయిరెడ్డి సమాధానం చెప్పే దమ్ముందా? ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శివా? బుద్దా ఫైర్

|
Google Oneindia TeluguNews

''ఎన్నికల సంఘం చేత ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎన్నికల్లో పోటీ చేశాను. ఇప్పుడేమో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి పేరుతో నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఉంటాడా? అసలా పదవికి విజయసాయికి కట్టబెట్టిందెవరు? సీఎం జగన్ కు చెప్పే నాకు నోటీసులు పంపారా? సాయిరెడ్డి లాంటోళ్ల వల్లే పార్టీకి నష్టం జరుగుతోంది...'' అంటూ నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత పార్టీకి రాసిన లేఖ సంచలనంగా మారింది. ఇదే అదనుగా విపక్ష నేతలంతా వైసీపీపై మూకుమ్మడి దాడిని ముమ్మరం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరో అడుగు ముందుకేసి ఏకంగా విజయసాయిరెడ్డికి భారీ సవాలు విసిరారు.

రఘురామ లేఖ తర్వాత బీజేపీ హైస్పీడ్.. నిమ్మగడ్డ భేటీతో లింకు.. సాయిరెడ్డి ఇరుకున పడ్డారా?రఘురామ లేఖ తర్వాత బీజేపీ హైస్పీడ్.. నిమ్మగడ్డ భేటీతో లింకు.. సాయిరెడ్డి ఇరుకున పడ్డారా?

ఎంపీ లేఖ తర్వాత..

ఎంపీ లేఖ తర్వాత..

సొంత పార్టీ వైసీపీ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు సమాధానంగా ఎంపీ రఘురామ రాసిన లేఖపై రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఘాటుగా స్పందించాయి. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయని, సీఎం జగన్ పై సొంత పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలే నిరసన వ్యక్తం చేసే పరిస్థితి నెలకొందని, జనం దృష్టిని మళ్లించడానికే నిమ్మగడ్డ రమేశ్ వీడియోల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారంటూ ఏపీ బీజేపీ మండిపడింది. రఘురామ తిరుగుబాటు వ్యవహారాన్ని, తనకు రక్షణ కావాలంటూ కేంద్రానికి ఆయన లేఖ రాయడాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబు సైతం పలు మార్లు ప్రస్తావించారు. గురువారం నాటి లేఖ తర్వాత టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా.. విజయసాయిని ఎద్దేవా చేస్తూ తీవ్ర కామెంట్లు చేశారు.

చైనా బందీలుగా భారత జవాన్లు.. గాల్వాన్ లోయలో హింస తర్వాత భయానక మైండ్ గేమ్.. ఇప్పుడు మైదానంలో..చైనా బందీలుగా భారత జవాన్లు.. గాల్వాన్ లోయలో హింస తర్వాత భయానక మైండ్ గేమ్.. ఇప్పుడు మైదానంలో..

సాయిరెడ్డి.. దమ్ముందా?

సాయిరెడ్డి.. దమ్ముందా?

షోకాజ్ నోటీసులకు బదులుగా ఎంపీ రఘురామ రాసిన లేఖ.. వైసీపీ పార్టీకే షోకాజ్ జారీ చేసినట్లుగా ఉందని వెంకన్న అభివర్ణించారు. ప్రధానంగా విజయసాయిని ఉద్దేశించి రఘురామ వ్యక్తం చేసిన అభ్యంతరాలను టీడీపీ నేత ప్రస్తావించారు. ‘‘ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శి అయిన మీకు.. యువజన శ్రామిక రైతు పార్టీ ఎంపీ నుంచి షోకాజ్ నోటీసు వచ్చినట్లుంది.. ఆ లేఖకు సమాధం చెప్పే దమ్ములేదా? అబ్బా సాయిరాం..'' అంటూ వెంకన్న సెటైర్ విసిరారు.

ట్విటర్ లో ఉడత ఊపులేనా?

ట్విటర్ లో ఉడత ఊపులేనా?


సొంత పార్టీ జారీచేసిన షోకాజ్ నోటీసుల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ ఎంపీ రఘురామ రాసిన లేఖపై అధికార వైసీపీ నుంచి రియాక్షన్ లేకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సాధారణంగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. దాదాపు అన్ని అంశాలపై స్పందించే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా రఘురామ కామెంట్లపై కామ్ గా ఉండిపోయారు. రఘురామ ప్రశ్నలకు బదులు చెప్పాలని సవాలు విసిరిన బుద్ధా వెంకన్న.. ‘‘ట్విట్టర్ లో ఉడుత ఊపులు ఆపండి విజయసాయిరెడ్డిగారూ'' అంటూ దెప్పిపొడిచారు.

Recommended Video

Congress MLC Jeevan Reddy Exclusive Interview On Telangana Agriculture Policy || Oneindia Telugu
అబ్బా సాయిరాం..

అబ్బా సాయిరాం..

సోషల్ మీడియా వేదికగా రాజకీయాలు ఊపందుకున్న ప్రస్తుత తరుణంలో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన కారణంతో పలువురు అరెస్టయిన సందర్భాలు కూడా ఇటీవల చోటుచేసుకున్నాయి. అధికా వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు పోటాపోటీగా ఐటీ టీమ్ లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ విజయసాయి రెడ్డి పెట్టే పోస్టులకు టీడీపీ బుద్ధా వెంకన్న కౌంటర్లిస్తూ రావడం కామన్ వ్యవహారంగా మారింది. విజయసాయి తన పేరు కలిసొచ్చేలా ‘సైరా పంచ్' అంటూ సెటైర్లు వేస్తుండగా.. వైసీపీ ఎంపీనే టార్గెట్ చేస్తూ ‘‘అబ్బా సాయిరాం..''నినాదాన్ని క్రియేట్ చేశారు బుద్ధా వెంకన్న. తన చివరి పోస్టులో టీడీపీ నేత విచిత్రమైన కామెంట్ చేశారు. జగన్ ను అల్లుడూ అని సంబోధిస్తూ.. సీబీఐ, ఈడీలను రద్దుచేద్దామంటూ విజయసాయి సూచన చేయడాన్ని సెటైర్ గా మలచారు.

English summary
tdp mlc buddha venkanna questions ysrcp mp vijaya sai reddy to react on mp raghu rama krishnam raju's letter. mp raju gave a sharp reaction to his own party's show cause notice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X