టీడీపీ-బీజేపీ మధ్య ప్రత్యేకహోదా చిచ్చు: వెంకయ్య, జైట్లీలకు గాలి హెచ్చరిక

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా మిత్ర పక్షాలైన బీజేపీ, టీడీపీల మధ్య చిచ్చు పెట్టనుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేమని, విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను నెరవేరుస్తున్నామని లోక్‌సభ‌లో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి.

ప్రతిపక్ష పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈనెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేమని తేల్చిచెప్పిన బీజేపీ నేతలపై అటు వైసీపీతో పాటు మిత్రపక్షమైన టీడీపీ నేతలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

బీజేపీ ధోరణిపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు గురువారం తిరుపతిలో నిప్పులు చెరిగారు. సాక్షాత్తూ పార్లమెంట్‌లోనే ఏపీకి ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేసిన నేతలు ఇప్పుడు ఏమయ్యారంటూ ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా ఏపీని బీజేపీ వేధిస్తోందని ఆయన ఆరోపించారు.

కేంద్రమంత్రులు వెంకయ్య, అరుణ్ జైట్లీ ఏపీకి ప్రత్యేకహోదా రాకుండా అడ్డుకుంటున్నారని గాలి వారిద్దరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీ ఇప్పుడు ఏమైందని బీజేపీని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతాయని హెచ్చరించారు.

అటు రాష్ట్రంలోనూ, ఇటు కేంద్రంలోనూ బీజేపీ, టీడీపీ మిత్రపక్షమే కదా అని టీడీపీ సైలెంట్‌గా ఉంటుందని అనుకోవద్దని బీజేపీ నేతలను గాలి హెచ్చరించారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి పదేళ్లు ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేసిన వెంకయ్య, జైట్లీలు... హోదా ఇవ్వని పక్షంలో పదవుల నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు.

Tdp Mlc Gali Muddu Krishnama naidu fires on bjp leaders over special status

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+