వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ తిట్ల వర్షంపై లోకేష్ కౌంటర్-నా జపం చేయనిదే నిద్రపట్టట్లేదు-అందుకే భరిస్తున్నా

|
Google Oneindia TeluguNews

ఏపీలో అసెంబ్లీ సమావేశాల వేదికగా వైసీపీ, టీడీపీ వార్ ముదురుతోంది. నిత్యం అసెంబ్లీలో ఏదో ఒక సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసేందుు టీడీపీ ప్రయత్నించడం, వైసీపీ నేతలు అడ్డుకోవడం, స్పీకర్ సస్పెండ్ చేయడం షరా మామూలుగా మారిపోయిన పరిస్ధితుల్లో ఇవాళ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు తనను టార్గెట్ చేసుకోవడంపై ఆయన ఇవాళ ఎదురుదాడికి దిగారు.

శాసనసభలో తాను లేకపోయినా, అక్కడుండే వైసీపీ సభ్యులకు తననుతిట్టనిదే పూట గడ వడంలేదని టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ వ్యాఖ్యానించారు. అలానే మండలిలోకూడా తన జపంచేయందే వారికి నిద్రపట్టడంలేన్నారు. తానంటే వారికి భయమని అర్థమవుతోందన్నరాు. సభలో, బయటా వారితప్పులను ఎత్తిచూపుతూ, ఆధారాలతోసహాప్రజల్లో వారిని దోషులుగా నిలబెడుతున్నాను కాబట్టే..తనపైవారికి చెప్పలేనంత అక్కసు, అసూయ, ద్వేషం ఉన్నాయన్నారు. అందుకే అయినదానికీ, కానిదానికీ తనను తిడుతూ, ప్రజల్లో హీరోలు అవుదామనుకుంటున్నారని లోకేష్ విమర్శించారు.

tdp mlc nara lokesh counter attack on ysrcp leaders, reveal reasons for attack on him

ప్రజల కోసమే అడ్డమైనవారు ఎన్నితిట్లుతిట్టినా భరిస్తున్నాననంటూ వైసీపీ ప్రజాప్రతినిధుల్ని ఉద్దేశించి లోకేష్ వ్యాఖ్యానించారు. తాను తాగుబోతునని దుర్భాషలాడినా, సహించానని, తనపై చేసిన అనేక అసంబద్ధమైన, నిరాధార ఆరోపణలపై ఇదివరకే నిరూపించాలని సవాల్ చేశానని లోకేష్ తెలిపారు. కానీ అధికారపార్టీ నుంచి ఎవరూ స్పందించలేదన్నారు. నన్ను ముండా అని తిట్టినా ఊరుకున్నానని, తాను పెద్ దవాళ్లను గౌరవించే వ్యక్తిగా ఏనాడూఎవరినీ ఏమీ అనలేదని లోకేష్ వెల్లడించారు. ఆఖరికి తన వయస్సుని కూడా మర్చిపోయి, డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి హద్దులు మీరి మాట్లాడినా తాను సంయమనం కోల్పోలేదన్నారు. హుందాగా, గౌరవంగానే వ్యవహరించానని లోకేష్ తెలిపారు. తన తప్పు తెలుసుకొని డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పలేదన్నారు. పేపర్ లో క్లియర్ గా ఆయన అన్నది రిపోర్టు అయిందన్నారు. అసెంబ్లీలో కూడా రికార్డైందైన్నారు.

అసెంబ్లీలో ఉన్నవారంతా టెన్త్ ఫెయిల్ బ్యాచ్ అని.. అది తమ దౌర్భాగ్యమని లోకేష్ తెలిపారు. వాస్తవాలు బయటపడుతున్నాయనే వైసీపీ వారికి నాటుసారా, కల్తీమద్యం అంటే భయం పట్టుకుందన్నారు. ఆధారాలతో సహా ప్రజలముందు వారిని దోషులుగా నిలబెడుతుంటే, నన్ను తిట్టి సమస్యలను పక్కదారిపట్టిస్తున్నారని లోకేష్ తెలిపారపు. నాటుసారా మరణాలపై చర్చించకుండా, తప్పించుకోవడానికే పెగాసెస్ అంశాన్నిసభలో చర్చకుతెచ్చారని లోకేష్ ఆరోపించారు. పెగాసస్ విషయంలో ప్రభుత్వం వద్ద ఆధారాలుంటే హౌస్ కమిటీవేసుకోవచ్చని ఎప్పుడోచెప్పానని లోకేష్ గుర్తుచేశారు. ఊరికే దాన్ని పట్టుకొని అసెంబ్లీలో బయటపడదామనిచూస్తున్న ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని చూస్తుంటే కుక్కతోకపట్టుకొని గోదావరి ఈదినవైనంగానే ఉందన్నారు.

పెగాసస్ అంశంపై చర్చ కేవలంసభా సమయాన్ని వృథాచేయడమేనని లోకేష్ తెలిపారు. తనన తిడుతుంటే శాసనసభలో స్పీకర్ తెగ ఆనందపడిపోతున్నారని, సీఎం విరగబడి నవ్వుతున్నారని లోకేష్ తెలిపారు. ఆనాడు తనతల్లిని దూషించినప్పుడు కూడా సీఎం, స్పీకర్ రాక్షసుల్లా వికృతంగా నవ్వారని, అవేవీ మర్చిపోనన్నారు. టెన్త్ ఫెయిల్ బ్యాచ్ శాసనసభలో ఉన్నారని, అలాంటివారు చెబుతుంటే వినడం ప్రజలఖర్మని లోకేష్ విమర్శించారు. మంత్రులు అసలు టెన్త్ కూడా చదవలేదని, సభా నియమాల ప్రకారం స్పీకర్, ఛైర్మన్ లు అమలు చేయాల్సిన నిబందనలు అమలుచేయరని లోకేష్ ఆరోపించారు. ఎథిక్స్ కమిటీకి ఇప్పటికే పాతికపైగా లేఖలురాశానని లోకేష్ తెలిపారు. టీడీపీ సభ్యులు సభకు అడ్డుపడుతున్నారంటూ బయటకు పంపిస్తున్నారు తప్ప, సభానియమాలు.. నిబంధనలు అనేవి స్పీకర్ కు, ఛైర్మన్ కు పట్టడం లేదన్నారు.

English summary
tdp mlc nara lokesh on today slams ysrcp mlas and ministers for targetting him in legislative assembly and council.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X