Nara Lokesh Twitter Poll : జగన్ ఢిల్లీ టూర్- మళ్లీ పోల్ పెట్టిన నారా లోకేష్- తాజా ప్రశ్నలివే..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ టూర్ కు వెళ్లారు. గతంలో సీఎం హోదాలో పలుమార్లు ఢిల్లీ పర్యటనలు చేసిన వైఎస్ జగన్ ఎప్పుడూ ఆ వివరాలు మాత్రం బయటపెట్టడం లేదు. గతంలో సీఎంలుగా పనిచేసిన వారు ఢిల్లీలో పర్యటించినప్పుడు, ప్రధాని వంటి వీఐపీల్ని కలిసినప్పుడు ఆ వివరాల్ని మీడియాకు వెల్లడించేవారు. జగన్ మాత్రం ఆ సూత్రాన్ని ఫాలో కావడం లేదు. దీంతో జగన్ ఢిల్లీ అనగానే సవాలక్ష ఊహాగానాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇదే క్రమంలో ట్విట్టర్ లోనూ ఈ అంశం చర్చనీయాంశమవుతోంది.
వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ అజెండా చెప్పకుండానే అక్కడికి వెళ్లడం, తిరిగి వచ్చేటప్పుడు సీఎంవో గతంలో ప్రస్తావించిన అంశాలతోనే ఈసారి కూడా ఓ ప్రెస్ నోట్ విడుదల చేయడం సర్వసాధారణమవుతోంది. దీంతో జగన్ ఢిల్లీ టూర్ పై ఓ వర్గం మీడియాతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో, విపక్షాల్లో మిశ్రమ ప్రచారం జరుగుతుంటుంది. అలాగే విపక్ష టీడీపీ కూడా జగన్ ఢిల్లీ టూర్ల అజెండాపై ట్వీట్లు, ప్రశ్నలు సంధిస్తుంటుంది. ఈసారి కూడా టీడీపీ యువ నేత నారా లోకేష్.. ఇదే అంశంపై ట్వీట్ పెట్టారు.

వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ అజెండా వెల్లడించకపోవడంతో ప్రధానితో భేటీలో ఆయన చర్చించబోయే అంశాలకు సంబంధించి టీడీపీ నేత లోకేష్.. ట్విట్టర్ లో మళ్లీ ఓ పోల్ పెట్టారు. ఇందులో ఆయన నెటిజన్లకు మూడు ప్రశ్నలు సంధించారు. ఏ1 రెడ్డి గారి మరోసారి ఢిల్లీ టూరు ఎందుకు? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నల్లో మొదటిది 1.బాబాయ్ ని లేపేసిన తమ్ముడుని కాపాడుకోవడానికి, 2.ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ2 ఫ్యామిలీని రక్షించడానికి, 3.అప్పులు చేయడానికి అనుమతి కోసం. ఇందులో ఏది కరెక్ట్ అంటూ లోకేష్ ప్రశ్నించారు. దీనికి నెటిజన్లు ఎవరికి తోచిన సమాధానాలు వారు ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications