రోజాకు టీడీపీ మహిళా ఎమ్మెల్సీ ఘాటు కౌంటర్ -కేంద్రాన్ని లాగడంపై..!
ఏపీలోని అన్నమయ్య జిల్లా ములకలచెరువులో తాజాగా బయటపడ్డ కల్తీ మద్యం వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో అధికార కూటమి నేతల్ని సైతం ప్రభుత్వం అరెస్టులు చేస్తుండటం వైసీపీకి వరంగా మారింది. ఇదే అదనుగా వైసీపీ ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన వైసీపీ మాజీ మంత్రి రోజా కేంద్రం కల్తీ మద్యం కేసుపై జోక్యం చేసుకోవాలని కోరారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే పంచుమర్తి అనురాధ ఘాటుగా స్పందించారు.
రోజా గారు.. మీరు మాట మీద నిలకడగా ఉండరు కాబట్టి మిమ్మల్ని తైతక్కల రోజా అనాల్సి వస్తోందంటూ టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. పీనుగ పోయినా... ఆ పీనుగ చేసిన పాపం ఇంకా అక్కడ అక్కడ కన్పిస్తూనే ఉంది తైతక్కల రోజా అన్నారు. మీ హాయాంలో నాసిరకం మద్యంతో ప్రజల రక్తాన్ని స్ట్రా వేసి మరీ పీల్చేశారని, అది గుర్తుంచుకోవాలని కోరారు. మీ పాపాల్ని తుడిచే ప్రయత్నంలోనే మొలకల చెరువులో కల్తీ సారా వ్యవహరం వెలుగులోకి వచ్చిందనే విషయం తెలుసుకోవాలన్నారు.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఈ కల్తీ సారా పాపం పురుడు పోసుకుందని, దాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బయట పెట్టిందని పంచుమర్తి అనురాధ తెలిపారు. మొలకల చెరువు కల్తీ సారా అంశాన్ని బయట పెట్టింది కూటమి ప్రభుత్వం, ప్రభుత్వంలోని ఎక్సైజ్ అధికారుల, తామూ ప్రక్షాళన చేస్తుంటే ఆ పాపాన్ని ప్రభుత్వంపై నెడుతున్నారని ఆక్షేపించారు.

గొడ్డలి పోటు నుంచి గులక రాయి వరకు మీ డ్రామాలు చూశాం. మీరు ఇలా మాట్లాడ్డం... మాకేం ఆశ్చర్యమనిపించడం లేదు, తప్పు మీరు చేయడం, నెపాన్ని మా మీద నెట్టడం మీకు అలవాటేగా అన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ ఎంక్వైరీ వద్దని జగన్ ఎందుకు డిమాండ్ చేశారనే దానికి సమాధానం చెప్పి.. ఆ తర్వాత కల్తీ లిక్కర్ వ్యవహరం మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తే బాగుంటుందని రోజాకు పంచుమర్తి అనురాధ సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications