తొడ గొట్టి బుద్దా ఛాలెంజ్ : లగడపాటి సర్వే నిజం కాదు: ఆ రెండు సర్వేలే నమ్ముతాం..!
ఎగ్జిట్ పోల్స్ అంచనాల పైన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తొడ గొట్టి మరీ ఛాలెంజ్ చేసారు. లగడపాటి సర్వే నిజం కాదని తేల్చి చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ మద్దతు పక్షాలను మేనేజ్ చేసేందుకు ప్రధాని మోదీ సర్వే సంస్థలను మేనేజ్ చేసి అనుకూలంగా చెప్పించుకున్నారని ఆరోపించారు.
లగడపాటి సర్వే నిజం కాదు..
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఉండవల్లిలోని ప్రజా వేదిక వద్ద తొడ గొట్టారు. లగడపాటి సర్వే నిజం కాదని తేల్చి చెప్పారు. 2014 ఎ న్నికల్లో ఈ రెండే కచ్చితం చెప్పాయి. ఈసారీ ఆ స ర్వేలనే టీడీపీ విశ్వసిస్తుంది. లగడపాటి సర్వే నిజం కాదు. టీడీపీకి 100 సీట్లే వస్తాయని ఆయన అంచనా వేశారు.. కానీ, 130కిపైగా సీట్లు వస్తాయి అంటూ తొడ గొట్టి మరీ ధీమా వ్యక్తం చేసారు. మహిళలంతా సంపూర్ణంగా టీడీపీకే మద్దతుగా నిలిచారని విశ్లేషించారు. పురుషులు 3 పార్టీలకు ఓట్లేశారన్నారు. కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా చెప్పటంతో కౌంటింగ్‌కు ముందు మూడు రోజులూ అధికారం వస్తుందనే భ్రమల్లో జగన్ బతికేయొచ్చు అంటూ ఎద్దేవాచేశారు. 2004,2009,2014లోనూ సర్వే సంస్థలు ఏపీ ఫలితాల పైన చెప్పిన అంచనాలు విఫలమయ్యాయని గుర్తు చేసారు.

మోదీ మేనేజ్ చేసారు..
ఎగ్జిట్ పోల్స్‌లో టీడీపీ నమ్మేది రెండు సంస్థలనే అని బుద్దా వెంకన్న వివరించారు. జాతీయ చానళ్ల సర్వేలు ఫేక్ సర్వేలన్నారు. టుడేస్ చాణుక్య, సీ- వోటర్‌వి మాత్రమే కరెక్టని పేర్కొన్నారు కాంగ్రెసేతర పక్షాలను మేనేజ్ చేయవచ్చన్న వ్యూహంతోనే మోదీ జాతీయ సర్వేలతో ఎన్డీఏకి 300 సీట్లు వస్తాయని చెప్పించారని ఆరోపించారు. 130 సీట్లతో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని తొడ గొట్టి చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం మీడియా సమవేశంలో రాసి పెట్టుకోండి..టీడీపీ 110 సీట్లకు పైగా గెలుస్తుందంటూ ధీమాగా చెప్పారు. ఏపీ ఓటర్ల నాడి పట్టుకోవటంలో జాతీయ సర్వే సంస్థలు విఫలమయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీకి అధికారం పైన నో సెకండ్ థాట్ అంటూ ధీమాగా చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications