జగన్‌కు జై కొట్టిన బాలకృష్ణ చిన్నల్లుడు...అమరావతి కంటే విశాఖనే బెస్ట్ అన్న భరత్

ఏపీలో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకున్నాయి. శనివారంతో ఎన్నికల ప్రచారం ముగియనుండంతో.. ప్రధాన పార్టీలన్నీ కూడా విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అభ్యర్థుల గెలుపు కోసం పార్టీల అధినేతలు గట్టిగానే శ్రమిస్తున్నారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు. జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన , బీజేపీ పార్టీలు జత కట్టాయి. అధికారంపై ఇరు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

తాము అధికారంలోకి రాగానే విశాఖ కేంద్రంగా పరిపాలన సాగిస్తామని సీఎం జగన్ తేల్చి చెప్పగా.. అధికారంలోకి వస్తే అమరావతినే తిరిగి రాజధానిగా కొనసాగిస్తామని కూటమి నేతలు ప్రకటించారు. ఇదిలా ఉంటే రాజధాని గురించి కూటమి అభ్యర్థి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కూటమి అభ్యర్థిగా విశాఖపట్నం ఎంపీ నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ పోటీ చేస్తున్నారు.

tdp mp candidate shri bharath support to vizag as capital

ఆయన తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా అమరావతి కంటే విశాఖపట్నం బెస్ట్ అనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. అమరావతిని అభివృద్ది చేయడానికి మన దగ్గర డబ్బుల్లేవని..విశాఖ అయితే ఫాస్ట్‌గా అభివృద్ది చెందుతుందని ఆయన తెలిపారు. విశాఖపట్నం అభివృద్ది చెందింతే... రాష్ట్రం కూడా ఆటోమేటిక్‌గా అభివృద్ది చెందుతుందని శ్రీ భరత్ చెప్పుకొచ్చారు. అమరావతిని అభివృద్ది చేయడానికి చాలా పెట్టుబడులు అవసరమని..అయితే అంత పెట్టుబడులు పెట్టే పరిస్థితిలో రాష్ట్రం లేదని ఆయన చెప్పారు.

https://www.facebook.com/reel/1116493419611668

అమరావతిలో వేలకోట్లు పెట్టే పరిస్థితిలో రాష్ట్రం ఇప్పుడు లేదని..దానితో పోలిస్తే విశాఖపట్నం వేగంగా అభివృద్ది చెందుతుందని శ్రీ భరత్ చెప్పుకొచ్చారు. అమరావతి అనేది ఇప్పుడు సాధ్యం కాదని.. అది 20 సంవత్సరాల తర్వాత కథ అని ఆయన పేర్కొన్నారు. దీంతో వైసీపీతో పాటు శ్రీ భరత్ సైతం రాజధానిగా వైజాగ్‌కే బెస్ట్ అనే చెప్పినట్టు అయింది. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న శ్రీ భరత్ ఇలా వైజాగ్‌కు మద్దతుగా మాట్లాడటం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శ్రీ భరత్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+