ప్రభుత్వాలు టార్గెట్ చేసాయి, బెదిరించారు- పోటీ చేయలేను, గల్లా ఎమోషనల్..!!
ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తి కర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తనను రెండు సార్లు గెలిపించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన నిర్ణయం ప్రకటన సమయంలో జయదేవ్ ఎమోషనల్ అయ్యారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తనను కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు టార్గెట్ చేసాయని చెప్పుకొచ్చారు.
రాజకీయాలకు గుడ్ బై : టీడీపీ కీలక నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు వీడ్కోలు చెప్పారు. రాజకీయాల్లో ఉంటే తన పని తాను చేయలేకపోతున్నానని వాపోయారు. కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో ఇబ్బంది అని మౌనంగా ఉండలేనని చెపపారు. రాజకీయం, వ్యాపారం రెండు చోట్ల ఉండలేని పరిస్థితి ఉందన్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని' గల్లా జయదేవ్ స్పష్టంచేశారు. ఏపీలో పరిశ్రమల విస్తరణకు ఇబ్బందులు కలిగాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో నెలకొల్పామని... విదేశాల్లో పరిశ్రమలను విస్తరిస్తున్నామని వివరించారు.

బెదిరింపులు వచ్చాయి : రాజకీయాల్లో నుంచి వైగొలిగే పరిస్థితి వస్తుందని అనుకోలేదన్నారు. తనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేసాయని వివరించారు.తాను రాజకీయంగా అన్నీ తట్టుకొనిన నిలబడ్డానని గల్లా చెప్పుకొచ్చారు. అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తా..ఈ సారి పార్ట్ టైం రాజకీయ నాయకుడిగా మాత్రమే వస్తానని వెల్లడించారు. ప్రాంతీయ పార్టీలలో పార్టీ లైన్ ప్రకారం మాట్లాడాలన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో మాట్లాడానని గుర్తు చేసారు.. దాంతో ఈడీ అధికారులు నన్ను పిలిచి బెదిరించారని చెప్పారు. తాను చట్ట ప్రకారమే వ్యాపారం చేస్తున్నానన్నారు. వ్యాపారం చేయాలంటే ప్రభుత్వ సహకారం తప్పనిసరని గల్లా పేర్కొన్నారు.

న్యాయ పోరాటం చేస్తున్నా : 70 ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆ విభాగాలను ఆయుధాలుగా మార్చి తన పై ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేసారు. వీటి పైన తాను న్యాయపరంగా ముందుకు వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. కోర్టులో గెలుస్తామనే నమ్మకం ఉందన్నారు. పోరాటంలో గెలిచినా యుద్ధంలో ఓడిన పరిస్థితి ఏర్పడిందంటూ గల్లా జయదేవ్ ఎమోషనల్ అయ్యారు. గల్లా రాజకీయాలకు గుడ్ బై చెబుతున్న వేళ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చకు కారణమయ్యాయి.












Click it and Unblock the Notifications