పవన్,జగన్ పై ట్విట్టర్ లో...ఆ పికేనే ఈ పికే దగ్గరకు:ఎంపి గల్లా జయదేవ్ మరో బాంబ్
గుంటూరు:ఇటీవల ట్విట్టర్ వేదికగా ప్రత్యర్థి పార్టీల అధినేతలపై పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ లతో ఆరోపణా అస్త్రాలు సంధిస్తున్న గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ మరోసారి విపక్ష నేతలపై తన ట్వీట్ల దాడి చేశాడు.
ఇటీవలే మోడీ-షా డైరెక్షన్‌లో "జగన్-పవన్" సినిమా అంటూ సంచలనం సృష్టించిన ఎంపీ జయదేవ్ తాజాగా మరో బాంబు పేల్చాడు. "జగన్-పవన్" కుట్ర ఇంకా ముగియలేదన్నాడు. ఇదిగో బీజేపీ, వైసీపీ, జనసేనల బంధానికి రుజువు అంటూ జనసేన వ్యూహకర్త దేవ్ పేరును ప్రత్యేకంగా పేర్కొన్నాడు. వైసీపీ, బీజేపీలకు వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిశోర్ శిష్యుడే ఈ దేవ్ అని చెప్పారు.

అంతేకాదు పవన్ కళ్యాణ్ దగ్గరకు ప్రశాంత్ కిషోరే పంపించాడని ఎంపి గల్లా ట్విట్టర్ లో ఆరోపించారు. ఇక పవన్‌కు ఈ దేవ్ వ్యూహకర్తగా పని చేయనున్నాడని ట్వీట్ చేశారు. ఎంపీ గల్లా జయదేవ్ సంధించిన ఈ ట్వీట్ తక్కువ వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేవ్‌ను తమ పార్టీ వ్యూహకర్తగా నియమిస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో ఎంపీ గల్లా జయదేవ్ తాజా ఆరోపణలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ హఠాత్తుగా దేవ్ అనే వ్యక్తిని వ్యూహకర్తగా నియమించడం పై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో ఎంపి గల్లా జయదేవ్ చేసిన తీవ్ర ఆరోపణలతో ఇక ఈ అంశం మరింత వేడెక్కనుంది. మరోవైపు టీడీపీ, జనసేనల మధ్య సోషల్ మీడియా వేదికగా ఆరోపణల, విమర్శల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండుపార్టీల మద్ధతుదారులు తమ ప్రత్యర్థులపై తమదైన శైలిలో దాడులు చేస్తున్న తరుణంలో టిడిపి తరుపున ఎంపి గల్లా జయదేవ్ తన పదునైన ట్వీట్లతో ప్రత్యర్థులని టార్గెట్ చేస్తుండటం ఆ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్తేజాన్ని కలిగిస్తోంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ దగ్గరకు ప్రశాంత్ కిషోరే పంపించాడని ఎంపి గల్లా ట్విట్టర్ లో ఆరోపించారు. ఇక పవన్‌కు ఈ దేవ్ వ్యూహకర్తగా పని చేయనున్నాడని ట్వీట్ చేశారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications