టీడీపీ ఎంపీ కేశినేని నానీకి కేంద్రంలో మరో కీలక పదవి .. రీజన్ ఇదేనా ?

టీడీపీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి కేంద్రం నుంచి ప్రతిష్ఠాత్మక పదవి లభించింది. గతంలోకూడా నానీకి పార్లమెంట్ అంచనాల కమిటీ సభ్యుడిగా అవకాశం ఇచ్చింది కేంద్ర సర్కార్ . ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన మరో కీలక పదవిని ఇచ్చింది. అసలు టీడీపీ అంటేనే గిట్టని కేంద్ర సర్కార్ నానీకి ఎందుకు ఇలా బంపర్ ఆఫర్స్ ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీ సభ్యుడిగా కేశినేని నానీ

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీ సభ్యుడిగా కేశినేని నానీ

కేంద్ర సర్కార్ కేశినేని నానీకి కీలక పదవినిచ్చింది.కేశినేని నానీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యారు. దేశంలో ఔషధాల తయారీ, రసాయనాలు,వాటికి సంబంధించిన నిబంధనలు,హక్కులు ఇతర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. అంతేకాకుండా,కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యక్రమాలను కూడా కమిటీ పర్యవేక్షించనుంది. అలాంటి కమిటీకి సభ్యుడిగా కేంద్రం బంపర్ ఆఫర్ ఇచ్చింది.

టీడీపీ ఎంపీ కేశినేని నానీకి కీలకపదవి ఇవ్వటంపై ఏపీలో చర్చ

టీడీపీ ఎంపీ కేశినేని నానీకి కీలకపదవి ఇవ్వటంపై ఏపీలో చర్చ


కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకున్న బీజేపీ వ్యూహాలు అర్ధం చేసుకోవటం తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులకు ఒకింత కష్టంగానే ఉందని చెప్పాలి . తనకు అనువుగా లేని రాష్ట్రాల్లో కూడా పాగా వేసేందుకు పక్కా వ్యూహాలను అమలు చేస్తున్న బీజేపీ ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించింది అన్న విషయం తెలిసిందే . అందులోనూ ఏపీలో ఆ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం నిజంగానే ఆసక్తిని రేకెత్తిస్తోందని చెప్పక తప్పదు.ఇక తాజాగా కేశినేని నానీకి మరోమారు కీలక పదవినిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం అయ్యింది.

 గతంలో పార్లమెంట్ అంచనాల కమిటీ సభ్యుడిగా అవకాశం

గతంలో పార్లమెంట్ అంచనాల కమిటీ సభ్యుడిగా అవకాశం

ఈ దఫా కూడా కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ, ఏపీ టీడీపీ సీనియర్ నేత - విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (కేశినేని నాని)ని పార్లమెంటు అంచనాల కమిటీ సభ్యుడిగా అవకాశం ఇవ్వటం, ఇక తాజాగా మళ్ళీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీలో సభ్యుడిగా ఎంపిక చెయ్యటం అంతా ఆపరేషన్ ఆకర్ష్ కోసమేనా అన్న భావన సైతం కలుగుతుంది. టీడీపీలో బలమైన ఎంపీగా ఉన్న కేశినేని నానీకి బీజేపీ మాత్రం సముచిత స్థానం ఇస్తుంది అన్న సంకేతాలు వెళ్ళటం కోసమే నానికి ఆఫర్లు ఇస్తున్నారేమో అన్న చర్చ జరుగుతుంది.

కేశినేని నానీకి బీజేపీపై సానుకూల దృక్పధం పెంచే యత్నం

కేశినేని నానీకి బీజేపీపై సానుకూల దృక్పధం పెంచే యత్నం

వరుస ఆఫర్లతో బీజేపీపై సానుకూల దృక్పధం ఏర్పడి నానీ బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం కూడా లేకపోలేదు .ఇప్పటికే ఏపీలో టీడీపీ సమస్యలతో ఎదురీదుతున్న పరిస్థితి. ఇక ఇలాంటి సమయంలో బీజేపీ నానీకి మంచి అవకాశం ఇవ్వటం , నానీని కమల దళంలోకి ఆహ్వానించే ఆలోచననేనా అన్న అనుమానం అందరిలో ఉంది. చూడాలి మరి భవిష్యత్ లో కేశినాని నానీ ఏం చేస్తారో .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+