'నా ఆఫీస్‌లో మోడీ, పవన్ కళ్యాణ్ ఫోటోలు తొలగించండి, అవి ఇక్కడ వద్దు'
విశాఖపట్నం: విశాఖపట్నం అనకాపల్లిలోని జాతీయ రహదారిలో గల తన క్యాంప్ కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీని తక్షణమే మార్చాలని తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస రావు కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
చదవండి: పవన్ వస్తే కారు వరకు, తీరు మార్చుకోమని చంద్రబాబుకు చెప్పాల్సింది: మురళీమోహన్
శుక్రవారం ఆయన తన కార్యాలయానికి వచ్చారు. ఆ ప్లెక్సీలో చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు గంటా శ్రీనివాస రావు, అయ్యన్న పాత్రుడు, నారా లోకేష్‌ల ఫోటోలు ఉన్నాయి. టీడీపీ నేతలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఛిత్రాలు కూడా ఉన్నాయి.
ఈ ఫోటోలను చూసి ఆయన వెంటనే ఫ్లెక్సీని మార్చాలని ఆదేశించారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిందని, అలాగే జనసేన కూడా టీడీపీకి ఎదురు తిరిగిందని, కాబట్టి మోడీ, పవన్ కళ్యాణ్‌ల ఫోటోలు కార్యాలయంలో ఉండవద్దన్నారు.

ప్రజలు గమనిస్తున్నారు
ఏపీలోని పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని వైసీపీ కర్నూలు జిల్లా తూర్పు అధ్యక్షులు శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో జరిగిన నీరు-చెట్టు, రహదారుల పనులు, ఇతర పనుల్లో జరిగిన అన్యాయలు, అక్రమాలపై జిల్లా కలెక్టర్‌కు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, క్వాలిటీ కంట్రోల్‌కు ఫిర్యాదులు చేస్తామన్నారు. సహకరించిన ఉద్యోగులను సైతం వదిలేదిలేదన్నారు.
అవిశ్వాస తీర్మానాన్ని పలుమార్లు జగన్ ప్రతిపాదిస్తే ఎక్కడ ఆయనకు మంచి పేరు వస్తుందోనని కేంద్రంలో ఇద్దరు, రాష్ట్రంలో ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయించి చోద్యం చూస్తున్నారని శిల్పా మండిపడ్డారు. సిద్దాపురం ఎత్తిపోతల పథకం తమ వల్లే వచ్చిందని నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చెప్పుకుంటున్న తీరును చూస్తుంటే నవ్వు వస్తోందన్నారు.












Click it and Unblock the Notifications