రాజ్యసభ నుండి టిడిపి ఏంపీల సస్పెన్షన్, 'బిజెపితో ఎలా కలిసి ఉండాలి'?

అమరావతి: ఏపీ రాష్ట్రానికి బడ్జెట్లో నిధుల కేటాయింపులో చోటు చేసుకొన్న అన్యాయంపై రాజ్యసభలో టిడిపి , వైసీపీ ఎంపీలు ఆందోళనను బుధవారం నాడు కొనసాగించారు.

Recommended Video

    Union Budget 2018: TDP MPs Hold Black Ribbon Protest

    అయితే రాజ్యసభ నుండి టిడిపి ఎంపీలు టీడీపీ సభ్యులు సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు, సీతారామలక్ష్మి తమ ఆందోళనను కొనసాగించడంతో వారిని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభ నుంచి సస్పెండ్ చేశారు.

    ఏపీ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో సరైన కేటాయింపులు లేవనే కారణంగా పార్లమెంట్ ఉభయసభల్లో ఏపీకి చెందిన అన్ని పార్టీల ఎంపీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.ఏపీకి న్యాయం జరిగేవరకు ఆందోళనలు కొనసాగించనున్నట్టు ఎంపీలు చెబుతున్నారు.

    ఏపీ రాష్ట్రానికి బడ్జెట్లో న్యాయం చేసేవరకు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీలు భావిస్తున్నాయి. ఏపీ రాష్ట్రంలో విపక్షాలు ఫిబ్రవరి 8వ, తేదిన రాష్ట్రబంద్ నిర్వహిస్తున్నాయి.

    రాజ్యసభ నుండి టిడిపిఎంపీల సస్పెన్షన్

    రాజ్యసభ నుండి టిడిపిఎంపీల సస్పెన్షన్

    ఏపీకి కేంద్రం నుండి నిధుల కేటాయింపులో వివక్షను నిరసిస్తూ టిడిపి, వైసీపీ ఎంపీలు బుధవారం నాడు కూడ ఆందోళన చేశారు. అయితే రాజ్యసభలో సభా కార్యక్రమాలకు పదే పదే అంతరాయం కల్గిస్తున్నందున టిడిపి, వైసీపీ ఎంపీలను సభ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. టిడిపి ఎంపీలు సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు, సీతారామలక్ష్మి తమ ఆందోళనను కొనసాగించడంతో వారిని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభ నుంచి సస్పెండ్ చేశారు.

    ఇతర పార్టీల ఎంపీలు మద్దతిచ్చారు

    ఇతర పార్టీల ఎంపీలు మద్దతిచ్చారు

    తమను సభ నుండి మార్షల్స్ బయటకు పంపించేందుకు ప్రయత్నించిన సమయంలో ఇతర పార్టీల సభ్యులు అడ్డుకొన్నారని రాజ్యసభ నుండి సస్పెన్షన్ కు గురైన సీఎం రమేష్ చె.ప్పారు.కానీ, సభలో ఉన్న విజయసాయి రెడ్డి మాత్రం అలాగే చూస్తూ కూర్చొన్నారని సీఎం రమేష్ ఆరోపించారు.

    మోడీ ప్రసంగం నిరాశ కల్గించింది

    మోడీ ప్రసంగం నిరాశ కల్గించింది

    రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో ప్రధానమంత్రి మోడీ ఏపీ రాష్ట్రానికి న్యాయం చేసేలా మాట్లాడుతారని భావించామని టిడిపి ఎంపీలు అభిప్రాయపడ్డారు. కానీ, ప్రధానమంత్రి మోడీ ఏపీకి ఏ మేరకు సహయం చేస్తారోననే విషయాన్ని తన ప్రసంగంలో స్పష్టత ఇవ్వలేదని టిడిపి ఎంపీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
    ఎన్డీయేతో కలిసి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాటం చేస్తున్నామని విభజన చట్టంలో ఉన్న అంశాలను కేంద్ర నెరవేర్చాలని ఆందోళన చేపట్టామని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. నాలుగేళ్లుగా ఎదురు చూశామని, చివరి బడ్జెట్‌లో ఏపీ గురించి ప్రకటన చేస్తారేమోనని ఎదురు చూశామని, తమకు నిరాశే ఎదురైందని ఇక ఏ విధంగా వాళ్లతో కలిసి పనిచేయాలని ఎంపీలు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము ఆందోళన చేశామే తప్ప.. వేరే ఏమీ లేదని వారన్నారు.

    మోడీ వద్ద మార్కుల కోసం వైసీపీ ప్రయత్నాలు

    మోడీ వద్ద మార్కుల కోసం వైసీపీ ప్రయత్నాలు

    ప్రధానమంత్రి మోడీ వద్ద మార్కులు కొట్టేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని టిడిపి ఎంపీలు ఆరోపణలు చేశారు. మరోవైపు చంద్రబాబు ఏమీ చేయడంలేదని విమర్శలు చేస్తున్నారని, వైసీపీ ఆలోచన ఏ విధంగా ఉందో అర్థం కావడంలేదని ఎంపీలు మండిపడ్డారు. ప్రధాని మోదీ దగ్గర మంచి అని మార్కులు వేయించుకుని, కేసుల నుంచి తప్పించుకోడానికి చూస్తున్నారని, ఏపీలో చంద్రబాబు ఏమీ చేయడం లేదని కుట్ర రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఎంపీలు దుయ్యబట్టారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+