టీడీపీ నాయకుల అణచివేతకు ప్రత్యేక చట్టం??
పలాసలో జరుగుతున్న భూకబ్జాలను తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తుంటే వారిని మంత్రి సీదిరి అప్పలరాజు అధికారులను అడ్డం పెట్టుకొని బెదిరిస్తున్నారని, జేసీబీలతో భయాందోళనలు సృష్టిస్తున్నారని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. తాను పలాస నియోజకవర్గంలోకి వస్తుంటే పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపించివేశారని, ఈ విషయంలో వారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. పోలీసులు హుందాగా వ్యవహరించాలని కోరారు.
ఇల్లు కూల్చేస్తారనే భయంతో ఒక మహిళ మృతిచెందిందని, తెలుగుదేశం పార్టీ నాయకుల అణచివేతకు ప్రత్యేకంగా ఏమైనా చట్టం తెచ్చారా? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు కబ్జాలపై తాము ప్రశ్నిస్తుంటే వారిని వదిలేసి తమపై దాడులు చేయడం ఎంతవరకు సబబన్నారు. సూదికొండపై పరిశీలనకు వెళితే తనపై దౌర్జన్యం కేసులు పెట్టారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్ ఛార్జి గౌతు శిరీష వెల్లడించారు. ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

ఒకరికి కష్టం వస్తే ఈ ప్రాంతవాసులంతా ఐక్యంగా నిలబడ్డారని, మీ అందరి తరఫున తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. పలాసలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ సూర్యనారాయణతోపాటు శ్రీనివాసగనర్ వాసులను పరామర్శించారు. చెరువు గర్భం ఆక్రమించుకున్నారని అధికారులు చెబుతున్నారని, 40 సంవత్సరాలుగా ఇక్కడ నిర్మాణాలు జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేదో సమాధానం చెప్పాలని రామ్మోహన్ నాయుడు నిలదీశారు.












Click it and Unblock the Notifications