వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా అయిపోయింది, చిన్న చూపు, ఏం చేద్దాం?: టిడిపి ఎంపీలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రసంగంలో ఏపీకి ఇస్తామన్న నిధుల విషయంలో కొత్త దనం లేకపోవడంతో టిడిపి ఎంపీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నుండి స్పష్టమైన ఇక వస్తోందని భావించడం లేదని టిడిపి ఎంపీలు అభిప్రాయపడ్డారు.

మిత్రులుగా కొనసాగలేం, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, వైసీపీ ఉందనుకొంటున్నారా?: గల్లా సంచలనంమిత్రులుగా కొనసాగలేం, ప్రజలు పిచ్చోళ్ళు కాదు, వైసీపీ ఉందనుకొంటున్నారా?: గల్లా సంచలనం

విదేశీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ఎంపీలు సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు.గురువారం రాత్రి ఢిల్లీలోని టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో టిడిపి ఎంపీలు సమావేశమయ్యారు.

రాజకీయ సమీకరణాలు మారుతాయి, బాబుపై ఈసీకి ఫిర్యాదు: మేకపాటి సంచలనంరాజకీయ సమీకరణాలు మారుతాయి, బాబుపై ఈసీకి ఫిర్యాదు: మేకపాటి సంచలనం

గురువారం సాయంత్రం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తన ప్రసంగంలో ఏపీకి వరాలను ప్రకటిస్తారని భావించిన టిడిపి ఎంపీలకు నిరాశే ఎదురైంది. అరుణ్ జైట్లీ పాత పాటే పాడారని టిడిపి ఎంపీలు అభిప్రాయపడుతున్నారు.

ఓపిక నశించింది: సీఎం రమేష్ సంచలనం, రాజీనామాకు సుజనా రెడీఓపిక నశించింది: సీఎం రమేష్ సంచలనం, రాజీనామాకు సుజనా రెడీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి సరైన నిధులు రాకపోవడంపై టిడిపి ఎంపీలు మండిపడుతున్నారు. కేంద్రం నుండి సరైన సమాధానం కావాలంటూ టిడిపి ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసన గళం విన్పిస్తున్నారు.

కేంద్రం నుండి సానుకూల సంకేతాల్లేవు

కేంద్రం నుండి సానుకూల సంకేతాల్లేవు

కేంద్రం నుండి సానుకూల సంకేతాలుండవనే అభిప్రాయాన్ని టిడిపి ఎంపీలు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నుండి సానుకూల స్పందన వస్తోందని ఆశించినా ప్రయోజనం లేకపోయిందని టిడిపి ఎంపీలు ఆందోళన చెందుతున్నారు. ఏపీకి సాయం చేస్తున్నామని, ఇంకా చేస్తామని గతంలో చెప్పినట్లుగానే జైటీ మళ్లీ రొటీన్ వ్యాఖ్యలు చేస్తూ చేసిన ప్రసంగం తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పారు.ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తుందని తాము అనుకోవడం లేదని, ఇక అంతా అయిపోయిందని భావిస్తున్నామని తెలిపారు.

ఏపీని చిన్నచూపు చూశారు

ఏపీని చిన్నచూపు చూశారు

ఏపీ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూసిందని టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. గతంలో ఏ రకంగా బడ్జెట్ల తర్వాత జైట్లీ ప్రసంగించారో అదే రకమైన ప్రకటనలు చేశారని రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. తాము బిజెపికి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ బిజెపి నుండి సానుకూల స్పందన లేదని రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు.

అంతా అయిపోయింది

అంతా అయిపోయింది


కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనతో అంతా అయిపోయిందనే భావనతో ఉన్నామని విజయవాడ ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని కేశినేని నాని చెప్పారు.

టిడిపి ఎంపీల సమావేశం

టిడిపి ఎంపీల సమావేశం


కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలపై టిడిపి ఎంపీలు టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో గురువారం రాత్రి సమావేశమయ్యారు. గురువారం నాడు పార్లమెంట్ ఉభయ సభల్లో చోటు చేసుకొన్న పరిణామాలపై టిడిపి ఎంపీలు చర్చించారు. విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడుతో మాట్లాడేందుకు టిడిపి ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం రాత్రి పొద్దుపోయాక ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టిడిపి ఎంపీలతో టెలికాన్పరెన్స్ నిర్వహించారు.

English summary
TDP MPS Unhappy on Union finance minister Arun jaitley statement in Loksabha on Thursday.after finance minister jaitley statement they were meeting in Tdp parliamentary party office on thursday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X