ట్విస్ట్: రాజీనామాపై జేసీ దివాకర్ రెడ్డి తగ్గలేదా, చంద్రబాబుకు కొత్త తలనొప్పి

చాగల్లు రిజర్వాయర్ నీటి కోసం ఎంపి జెసి దివాకర్ రెడ్డి గతంలోను రాజీనామా చేస్తానని చెప్పారా?అంటే అవుననే చెప్పవచ్చు.తుంగభద్ర జలాలు చాగల్లు జలాశయానికి విడుదల చేయాలని కొద్ది రోజులుగా కోరుతున్నారు.ఎంపీఆ

అనంతపురం/అమరావతి: చాగల్లు రిజర్వాయర్ నీటి కోసం ఎంపి జెసి దివాకర్ రెడ్డి గతంలోను రాజీనామా చేస్తానని చెప్పారా? అంటే అవుననే చెప్పవచ్చు. తుంగభద్ర జలాలు చాగల్లు జలాశయానికి విడుదల చేయాలని కొద్ది రోజులుగా కోరుతున్నారు.

ఎంపీఆర్‌ జలాశయానికి తుంగభద్ర జలాలు వచ్చిన వెంటనే చాగల్లు రిజర్వాయర్‍‌కు నీటిని విడుదల చేయకపోతే రాజీనామా చేస్తానంటూ కొద్ది రోజుల క్రితం ఆయన లిఖితపూర్వకంగా కలెక్టర్‌కు ఓ లేఖను కూడా ఇచ్చారు. కానీ తుంగభద్ర జలాల్లో చాగల్లుకు కేటాయింపు లేనందున విడుదల చేయలేదు.

అంతలోనే షాకిచ్చిన జేసీ దివాకర్ రెడ్డి

అంతలోనే షాకిచ్చిన జేసీ దివాకర్ రెడ్డి

మరోవైపు, శింగనమల నియోజకవర్గంలో ఆయకట్టుకు, చెరువులకు నీటి కేటాయింపు ఉండటంతో తమకు నీటిని విడుదల చేయాలంటూ శింగనమల నాయకులు కోరారు. వారి అభ్యర్థనను అధికారులు పక్కనపెట్టారని అంటున్నారు. ఇంతలో జేసీ దివాకర్ రెడ్డి హఠాత్తుగా రాజీనామా అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. ఈసారి ఏకంగా బాహాటంగా చెప్పారు.

రాజీనామా అస్త్రంతో నెగ్గించుకున్న జేసీ

రాజీనామా అస్త్రంతో నెగ్గించుకున్న జేసీ

చాగల్లు రిజర్వాయర్‌కు నీరు ఇవ్వకుంటే రాజీనామా చేస్తానంటూ గురువారం తెలిపారు. దీంతో ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. జేసీని బుజ్జగించారు. మంత్రి మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఆ శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు.. అనంతలోని సీఈ జలంధర్‌, హెచ్చెల్సీ ఎస్‌ఈ శేషగిరిరావులతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే చాగల్లుకి నీటిని విడుదల చేశారు.

ఆ నాయకుల రుసరుస

ఆ నాయకుల రుసరుస

నీటి కేటాయింపు పరిధిలో లేని చాగల్లుకు నీటిని విడుదల చేయడంతో శింగనమల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, రుసరుసలాడుతున్నారు. తమను పక్కనపెట్టి, చాగల్లుకు నీటిని ఎలా ఇస్తారంటూ శింగనమల నాయకులు నిలదీస్తున్నారని తెలుస్తోంది.

చంద్రబాబే రంగంలోకి దిగారు

చంద్రబాబే రంగంలోకి దిగారు

కాగా, జేసీ రాజీనామా హెచ్చరికతో గురువారం ఆకస్మికంగా టిడిపి అధిష్టానం రంగంలోకి దిగింది. ఆ సమయంలో సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ఉన్నారు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి వచ్చింది. వెంటనే జేసీ ఆవేదనకు గల కారణం తెలుసుకోవాలని చంద్రబాబు మంత్రి దేవినేనికి సూచించారు. అనంతరం సమస్యను తీర్చారు.

వాటా కూడా ఇవ్వాలని జేసీ దివాకర్ రెడ్డి మెలిక

వాటా కూడా ఇవ్వాలని జేసీ దివాకర్ రెడ్డి మెలిక

చాగల్లు రిజర్వాయర్‌కు నీటి విడుదలపై మాటలు మాత్రమే వద్దని, తుంగభద్ర జలాల్లో వాటా లేదని, అందులో వాటా ఇస్తూ జీవో ఇవ్వాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు జైసీ సూటిగా చెప్పారని తెలుస్తోంది. జీవో ఇవ్వకుంటే రాజీనామాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+