జగన్ రాక వేళ వేమిరెడ్డి సంచలన నిర్ణయం..! ఇక గుడ్ బై..!

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన సంచలనాలు రేపుతోంది. జైల్లో ఉన్న వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు తాజాగా టీడీపీ నేతలకు టార్గెట్ అవుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్ నెల్లూరు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగి ఆ తర్వాత ఆయనకు దూరమై టీడీపీలో చేరి నెల్లూరుకు ఎంపీ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి మైనింగ్ పై వైసీపీ నేతలు కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా వేమిరెడ్డి క్వార్ట్జ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కూడా సిద్ధమవుతున్నారు. దీనిపైనా వైసీపీ నేతలు ఆయన్ను తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ నెల్లూరు టూర్ కు కూడా వస్తున్నారు. దీంతో ఏమనుకున్నారో ఏమో కానీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మైనింగ్ కు పూర్తిగా గుడ్ బై చెప్పేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రెస్ మీట్ పెట్టి మరీ కీలక ప్రకటన చేశారు.

tdp mp vemireddy Prabhakar reddy good bye to mining ahead of ys jagan s Nellore tour

నెల్లూరు జిల్లాలో 96 కంపెనీలు క్వార్ట్జ్ ఖనిజాన్ని ఎగుమతి చేస్తున్నాయని, కానీ వైసీపీ నేతలు తన కంపెనీల్ని మాత్రమే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని వేమిరెడ్డి తెలిపారు. క్వార్ట్జ్ ఫ్యాక్టరీ ద్వారా వెయ్యి మంది కార్మికులకు ఉపాధి కల్పించాలనుకుంటే తనపైనే ఆరోపణలు చేస్తారో అని వేమిరెడ్డి ప్రశ్నించారు. ఈ క్వార్ట్జ్ ఫ్యాక్టరీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని, తాను వదిలేశాను కాబట్టి ఇంకెవరైనా ఈ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చని కూడా ఆయన సూచించారు. అందుకు కూడా తాను సహకరిస్తానన్నారు. దోచేసుకుంటున్నానంటూ తనపై చేస్తున్న విమర్శలు తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

క్వార్ట్జ్ ఫ్యాక్టరీకి తనకూ సంబంధం లేదని తాను చెప్పేశానని, రేపటి నుంచి ఎవరైనా దీనిపై విమర్శలు చేస్తే బాగోదని వేమిరెడ్డి తెలిపారు. కడప జిల్లాలో ఇండోసోల్ సంస్థకూ ఈ ఫ్యాక్టరీ అవసరం ఉందన్నారు. ఎక్కడా తాను అక్రమ మైనింగ్ కు పాల్పడలేదన్నారు. 19 వేల టన్నులు మాత్రమే మైనింగ్ చేసి ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. రేపటి నుంచి దీనిపై మాట్లాడితే వారి కర్మకే వదిలిపెడుతున్నట్లు వేమిరెడ్డి తెలిపారు. భగవంతుడే వారి సంగతి చూసుకుంటాడన్నారు.

tdp mp vemireddy Prabhakar reddy good bye to mining ahead of ys jagan s Nellore tour

తాను చేస్తుంది మంచి పని అని.. అయినా ఎందుకు అనిపించుకోవాలని వ్యాపారం మూసేస్తున్నట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. భయం కాదని, జిల్లాలో మాటలు అనిపించుకోవడం ఎందుకని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సీఎస్ఆర్ నిధులతో వ్యాపారం చేస్తున్నారని విమర్శిస్తున్నారని, అదేమీ అక్రమం కాదని, దానికీ అన్ని లెక్కలూ ఉన్నాయని వేమిరెడ్డి తెలిపారు. త్వరలో జిల్లాలోని ఉదయగిరి నుంచి వీపీఆర్ నేత్ర అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+