కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆధారాలున్నాయి: బుగ్గన భేటీపై కేశినేని, అసలాట రేపటి నుంచి: మురళీమోహన్ హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీ అగ్రనేతలతో కలిశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓ వైపు బుగ్గన, మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఈ విషయంపై స్పష్టత ఇచ్చే ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. శుక్రవారం టీడీపీ ఎంపీలు చంద్రబాబుతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో పోరాడుతున్నామని, కానీ వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని నిమ్మల కిష్టప్ప అన్నారు. ఇక కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమని చెప్పారు. నిన్నటి ఎపిసోడ్‌లో (బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇష్యూ) బీజేపీ, వైసీపీ కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పారు.

 ఆధారాలు ఉన్నాయని కేశినేని నాని

ఆధారాలు ఉన్నాయని కేశినేని నాని

అవిశ్వాసం కోసం పోరాడుతున్నామంటూ వైసీపీ బీజేపీకి సాగిలపడుతోందని ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. ప్రభుత్వ వాహనం వెళ్లినప్పుడు లాగ్ బుక్ మెయింటెన్ చేస్తారని చెప్పారు. ఆ లాగ్ బుగ్ ప్రకారం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీ నేత రామ్ మాధవ్ ఇంటికి వెళ్లినట్లుగా ఉందన్నారు. ఏపీ భవన్ సీసీ కెమెరాల్లో అంతా రికార్డయిందని చెప్పారు. బీజేపీ, వైసీపీ కుమ్మక్కు రాజకీయాలకు ఆధారాలు ఉన్నాయని చెప్పారు.

ఆంధ్రాలో హోటళ్లు లేవా?

ఆంధ్రాలో హోటళ్లు లేవా?


ఢిల్లీలో బుగ్గన -బీజేపీ నేతల భేటీపై ఎంపీ మురళీ మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో హోటళ్లు లేవని ఢిల్లీకి వెళ్లి శాంగ్రిల్లా హోటల్లో భోజనం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఎవరి చెవిలో పూవులు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. చంద్రబాబును ఒంటరి చేయాలని చూస్తున్నారని, కానీ వారి ఆటలు ఏమాత్రం సాగవని తేల్చి చెప్పారు.

అసలు ఆట రేపటి నుంచి ప్రారంభం

అసలు ఆట రేపటి నుంచి ప్రారంభం

చంద్రబాబును ఒంటరిని చేయాలనే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని మురళీ మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా చంద్రబాబు వైపు ఉన్నారని చెప్పారు. పోరాటం అంటే ఏమిటో రేపటి నుంచి చూపిస్తామని వైసీపీ, బీజేపీలను హెచ్చరించారు. అసలు ఆట రేపటి నుంచి ప్రారంభమవుతుందన్నారు.

ఏపీలో రాజకీయ వేడి

ఏపీలో రాజకీయ వేడి

ఏపీ భవన్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలిశారని, వారు బీజేపీ పెద్దలు రామ్ మాధవ్, అమిత్ షాలతో కలిశారని టీడీపీ నేతలు కొందరు ఆరోపిస్తున్నారు. తాము కలిసింది వాస్తవమేనని, తాము చిన్నప్పటి నుంచి స్నేహితులమని, కానీ అమిత్ షా తదితరులను కలిసింది వాస్తవం కాదని అకుల, బుగ్గన చెబుతున్నారు. ఇది ఏపీలో రాజకీయ వేడిని రాజేసింది.

మేం కలుసుకోవాలనుకుంటే ఎక్కడో కలుసుకునేవాళ్లం

మేం కలుసుకోవాలనుకుంటే ఎక్కడో కలుసుకునేవాళ్లం

ఢిల్లీలో తాము భేటీ అయినట్లు వచ్చిన వార్తలను బుగ్గన, ఆకుల సత్యనారాయణలు ఒకటికి రెండుసార్లు ఖండించారు. తాను బుగ్గన ఎక్కడికో కలిసి వెళ్లామన్న వార్తలు సరికాదని, ఆయనా, నేను బాల్యమిత్రులమని, ఏపీ భవన్‌లో కలిసినప్పుడు మాట్లాడుకున్నామని, రాజకీయంగా మేం మాట్లాడుకోవాలనుకుంటే హైదరాబాద్‌లో, విజయవాడలో ఎక్కడైనా ఎవరికీ తెలియకుండా కలుసుకుంటాం కదా అని ఆకుల అన్నారు. తాను ఒక్కసారి ఢిల్లీ వెళ్తేనే టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారని బుగ్గన అన్నారు. రాజ్యాంగం, అవినీతి గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదన్నారు. రహస్యంగా బీజేపీ నేతలను కలవాల్సిన అవసరం లేదన్నారు. ఆకుల సత్యనారాయణను తాను కలిసింది వాస్తవమే అన్నారు.

English summary
Telugudesam Party MPs Murali Mohan and Kesineni Nani on YSR Congress Party MLA Buggana Rajendranath Reddy meeting with BJP leaders
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X