Chandra Babu: నారా లోకేశ్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేఖ..
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం లేఖ రాశారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుపై జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతికి టీడీపీ ఎంపీలు రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాశారు. సెప్టెంబర్ 26న లోకేశ్ నేతృత్వంలో టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలిసిన లేఖ అందజేశారు. ఎంపీలు అందించిన లేఖపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఆ లేఖను కేంద్ర హోంశాఖకు పంపించింది.
ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు రాష్ట్రపతి కార్యాలయం డిప్యూటీ కార్యదర్శి రుబీనా చౌహాన్ లేఖ ద్వారా తెలియజేశారు. మరోవైపు చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ప్రభుత్వ వైద్యులు తెలిపారు. కానీ ఆయనకు చల్లని వాతావరణం అవసరమని తేల్చే చెప్పారు.

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సూచనలు, నివేదిక ఆధారంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టుని ఆశ్రయించారు. ఏసీబీ కోర్టులో ఇందుకు సంబంధించి వాదనలు కూడా వినిపించారు. కోర్టులో వాదనల అనంతరం రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీబీ కోర్టు జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యులతో కలిసి జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
చంద్రబాబు వేసుకునే మందులు తమకు చూపించినట్లు చెప్పారు. అవి చూసిన తర్వాతే మిగతా మందులు సూచించామని పేర్కొన్నారు. చంద్రబాబును చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలని జైలు అధికారులకు ఇప్పటికే సూచించామని పేర్కొన్నారు. చల్లని వాతావరణం లేకపోతే మేము ఇచ్చిన మందులు ఎంతవరకు పని చేస్తాయో తెలియదన్నారు. ఆయనకు ఎలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. గతంలో ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యలు ఏమిటో తమకు తెలియదన్నారు.












Click it and Unblock the Notifications