వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు వ్యూహకర్తా? రాబిన్ శర్మ వ్యూహకర్తా?

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలు అత్యంత ప్రత్యేకం. దేశ రాజకీయాలు ఒక ఎత్తయితే ఏపీ, తెలంగాణ రాజకీయాలు మరో ఎత్తు. ఎత్తుకు పై ఎత్తులు వేసేవారు, ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేసేవారు, ప్రజల్ని పార్టీలపట్ల ఆకర్షితులను చేసేలా ప్రసంగించేవారు... ఇలా అరుదైన లక్షణాలు కలిగిన రాజకీయ నాయకులు రెండు తెలుగు రాష్ట్రాలకు సొంతం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాణక్యుడిగా పేరుంది. ఆయన వ్యూహం పన్నితే ప్రత్యర్థులు వలలో ఇరుక్కుపోయిన చేపల్లా అయిపోయేవారు. అటువంటి చంద్రబాబునాయుడికి ఎన్నికల వ్యూహకర్త అవసరమా? అనే చర్చ ఏపీ ప్రజల్లో నడుస్తోంది.

నేతలకు రాబిన్ శర్మ పరిచయం

నేతలకు రాబిన్ శర్మ పరిచయం

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇటీవల పార్టీ విస్త్రత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలకు రాబిన్ శర్మను పరిచయం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వాస్తవానికి కొంతకాలం నుంచే రాబిన్ శర్మ టీడీపీకి పనిచేస్తున్నారు. నాయకులందరికీ పరిచయం చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరించారు.

ఎమ్మెల్యేలను తరలించి క్యాంప్ ఏర్పాటు

ఎమ్మెల్యేలను తరలించి క్యాంప్ ఏర్పాటు

1984లో ఎన్టీఆర్ విదేశాలకు వైద్యచికిత్స కోసం వెళ్లిన తరుణంలో నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ అందరికీ గుర్తుంటుంది. ఆ పరిణామాల నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో చంద్రబాబు దేశంలోని సరికొత్త పరిణామానికి తెరతీశారు. ఎమ్మెల్యేలను ఇతర రాష్ట్రాలకు తరలించి క్యాంప్ ఏర్పాటు చేసి, పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత వారిని తీసుకొచ్చి వర్గాన్ని కాపాడుకున్నారు.

తర్వాత ఎంతోమంది ఈ పద్ధతిని అనుసరించి ప్రభుత్వాలను నిలుపుకున్నారు. అటువంటి చంద్రబాబుకు రాబిన్ శర్మ అవసరమని ఒకవర్గం, అవసరంలేదని మరోవర్గం వాదిస్తోంది.

ప్రస్తుత రాజకీయాలకు చంద్రబాబు సరిపోరు?

ప్రస్తుత రాజకీయాలకు చంద్రబాబు సరిపోరు?


చంద్రబాబునాయుడు పాతకాలపు రాజకీయవేత్త కాబట్టి ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలకు సరిపోవడంలేదని, అందుకు వ్యూహరచన, ప్రణాళిక భిన్నంగా ఉండాలని, కాబట్టి ప్రశాంత్ కిషోర్ పద్ధతిలో ఒక వ్యూహకర్త అవసరమని భావిస్తున్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ లాంటి కార్యక్రమాలు రాబిన్ శర్మ ఆలోచనలో నుంచి వచ్చినవేనని, అవి పార్టీకి మైలేజ్ నిచ్చాయని చెబుతున్నారు. మరో వర్గం మాత్రం తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ ను దేశ రాజకీయాలకు సంబంధించి ఉపయోగించాలనుకున్నారని, కొద్దిరోజులు పీకేతో పనిచేసిన తర్వాత కేసీఆర్ కు అతను అవసరం లేదని అర్థమైందన్నారు. ఎటువంటి వ్యూహకర్త అవసరం లేకుండా ఎన్నికలను ఎదుర్కోవడానికి కేసీఆర్ సిద్ధపడ్డారని, తనపై అంత నమ్మకం ఉంది కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ ఉద్ధండులే. అయితే ఏపీలోని పరిణామాలను ఎదుర్కోవడానికి, పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి వ్యూహకర్త అవసరమని చంద్రబాబు భావించినట్లు పార్టీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

English summary
Politics in Telugu states is very special.If national politics is one level, AP and Telangana politics is another level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X