నిజమేనా?: 'నంద్యాల' కోసం రౌడీ షీటర్లకు టీడీపీ ఆఫరా!, జగన్ మీడియా ఇలా?

రౌడీషీట్ ఉన్నంత మాత్రానా భయపడాల్సిన అవసరం లేదని, టీడీపీ గెలుపు కోసం పనిచేస్తే.. రౌడీ షీట్ ఎత్తేస్తామని ఆయన హామి ఇచ్చినట్లు చెబుతున్నారు.

కర్నూలు: నంద్యాల ఉపఎన్నికలో గెలుపు కోసం టీడీపీ అడ్డదారులు తొక్కుతోందంటూ ప్రత్యర్థి వర్గం మీడియా ఆరోపిస్తోంది. ఏకంగా రౌడీ షీటర్లను రంగంలోకి దించి.. నయానో.. భయానో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి యత్నిస్తున్నట్లుగా ఆరోపణలు చేస్తోంది.

తాజాగా టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. రౌడీషీట్ ఉన్నంత మాత్రానా భయపడాల్సిన అవసరం లేదని, టీడీపీ గెలుపు కోసం పనిచేస్తే.. రౌడీ షీట్ ఎత్తేస్తామని ఆయన హామి ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ మేరకు పార్టీ సమావేశంలో ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

tdp offer to rowdy sheeters in nandyala by poll

విషయాన్ని ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లామని, త్వరలోనే మంత్రి లోకేష్ మీతో సమావేశమవుతారని సోమిశెట్టి చెప్పినట్లు సమాచారం. ఓట్ల కోసం రౌడీ షీటర్లను సైతం టీడీపీ ఉపయోగించుకుంటుందనేది ప్రత్యర్థి వర్గం ప్రధాన ఆరోపణ.

ఇదిలా ఉంటే, నంద్యాల రాజకీయం టీడీపీలో అంతర్గత విభేదాలను ఇంకా రాజేస్తూనే ఉంది. ప్రచార పర్వంలో మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండటం దీనికి ఊతమిస్తోంది. అంతర్గత విభేదాలతో సాగుతున్న టీడీపీ ప్రచారానికి జనం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే దానిపై ఆ పార్టీలోను ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+