పార్టీ మారితే రూ.40కోట్లు: టీడీపీ ఆఫర్‌పై జగన్ పార్టీ ఎమ్మెల్యే సంచలనం
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూతలపట్టు ఎమ్మెల్యే డా. సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరితే రూ.40కోట్లు ఇస్తామని ఆ పార్టీ నేతలు తనతో బేరసారాలకు దిగారని తెలిపారు.
Recommended Video

చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం మోటుమల్లెల పంచాయతీ బండమీద చల్లవారిపల్లెలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలుపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమంపై లేదని టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తాను భయపడేది లేదని సునీల్ కుమార్ చెప్పారు. తాను ఎప్పటికీ తన గురువు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటే ఉంటానని తేల్చి చెప్పారు. కాగా, తాజాగా సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.












Click it and Unblock the Notifications